
వరుణ్ ధావన్, సారా అలీఖాన్
వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కూలీ నెం.1’. 1995లో వచ్చిన ‘కూలీ నెం.1’ చిత్రానికి ఇది రీమేక్. పాత సినిమాకి దర్శకత్వం వహించిన డేవిడ్ ధావనే రీమేక్‌ని తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సారా మాట్లాడుతూ – ‘‘కూలీ’ సినిమాని ముగించాం. మా బెస్ట్, కూలెస్ట్ కూలీగా ఉన్నందుకు వరుణ్ ధావన్‌కు స్పెషల్ థ్యాంక్స్. నా లగేజ్‌ని నాతో నువ్వు మోయించినట్టుగా ఎవ్వరూ మోయించి ఉండలేరు. నిన్ను విసిగించడం కచ్చితంగా మిస్ అవుతాను’’ అని అన్నారు. ‘కూలీ నెం.1’ చిత్రం మే 1న విడుదల కానుంది. అన్నట్లు.. వరుణ్ ధావన్.. డేవిడ్ ధావన్ కుమారుడు అనే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment