నర్స్‌ నం.1 | Varun Dhawan was getting ready in nurse getup | Sakshi
Sakshi News home page

నర్స్‌ నం.1

Published Fri, Dec 18 2020 12:36 AM | Last Updated on Fri, Dec 18 2020 12:42 AM

Varun Dhawan was getting ready in nurse getup - Sakshi

వరుణ్‌ ధావన్, సారా అలీఖాన్‌

తాజా చిత్రం ‘కూలీ నెం.1’ కోసం కూలీగా మారారు బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌. ఈ సినిమాలో హీరోయిన్‌ సారా అలీఖాన్‌ను ప్రేమలో పడేయడానికి చాలా వేషాలే వేశారట. అందులో నర్స్‌ వేషం ఒకటి. సినిమాలో కొద్దిసేపు ఈ నర్స్‌ గెటప్‌లో కనిపిస్తారు వరుణ్‌. ఈ సీన్స్‌ చిత్రీకరించే ముందు వరుణ్‌ నర్స్‌ గెటప్‌ మేకప్‌ చేసుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రా మ్‌లో పంచుకున్నారు సారా. ‘హాటెస్ట్‌ నర్స్‌ వరుణ్‌’ అని క్యాప్షన్‌ చేశారామె. వరుణ్‌ ధావన్‌ తండ్రి డేవిడ్‌ ధావన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 25న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement