వాషింగ్టన్: అమెరికా అధ్యకక్షుడు జో బైడెన్ తన వయసుపై తానే జోకులు వేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న దేశ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున బైడెన్ మళ్లీ పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా షూట్ చేసిన ఒక టీవీ ప్రకటనలో బైడెన్ తనపై తానే జోకులు వేసుకున్నారు.
‘చూడండి.. నేను యువకుడిని కాదు. ఇందులో రహస్యమేమీ లేదు. అయితే అమెరికా ప్రజలకు ఏం చేయాలో నాకు తెలుసు’ అని కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ బైడెన్ యాడ్‌లో చెప్పడం ఆసక్తిరేపింది. ఆ తర్వాత తాను కరోనాను ఎలా నియంత్రించాను, వృద్ధులకు ఇన్సులిన్ ధరలను ఎలా తగ్గించాను, మౌలిక సదుపాయాల చట్టం, గర్భం ధరించే విషయంలో మహిళలకు స్వేచ్ఛ లాంటి విషయాల్లో తన విజయాలను వీడియోలో బైడెన్ ప్రజలకు వివరించారు.
అయితే ఇదంతా పూర్తయిన తర్వాత యాడ్‌లో వన్ మోర్ టేక్ అనే వాయిస్ వినిపిస్తుంది. దీనికి ‘చూడు. నేను చాలా యంగ్, ఎనర్జిటిక్, అందగాడిని. నేనేం తప్పు చేశాను’ అని ముఖంలో కాస్త కోపంతో బైడెన్ అనడంతో యాడ్ బాగా పాపులర్ అయింది. ఇటీవలి కాలంలో బైడెన్ పలు విషయాలను మర్చిపోయి ప్రవర్తించిన ఉందంతాలు వెలుగు చూశాయి. తాజాగా జార్జియాలో హత్యకు గురైన నర్సింగ్ విద్యార్థిని లేకెన్ రిలే విషయం మాట్లాడుతూ ఆమె పేరును లింకన్ రిలే అని ఉచ్చరించడంతో బైడెన్ మతిమరుపు మరోసారి బయటపడినట్లయింది.
ఇదీ చదవండి.. లెబనాన్‌లో ఓ ఇంటిపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు మృతి
Comments
Please login to add a commentAdd a comment