'మళ్లీ అంటే నా భార్య విడాకులిస్తుంది' | If I Were Able To Run For Third Term, Michelle Would Divorce Me: Obama | Sakshi
Sakshi News home page

'మళ్లీ అంటే నా భార్య విడాకులిస్తుంది'

Published Tue, Oct 25 2016 3:09 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

'మళ్లీ అంటే నా భార్య విడాకులిస్తుంది' - Sakshi

'మళ్లీ అంటే నా భార్య విడాకులిస్తుంది'

లాస్ ఎంజెల్స్: తన భార్య మిషెల్లీ ఒబామాకు అసలు రాజకీయాలంటేనే ఇష్టం ఉండదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఒక వేళ తనకు మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంటే మిషెల్లీ ఏకంగా విడాకులు ఇస్తుందని చమత్కరించారు. ఓ లైవ్ షోలో పాల్గొన్న ఒబామా ప్రస్తుతం అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ల తరుపున బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ప్రతిసారి తనను ట్వీట్ ద్వారా విమర్షించడంపై కాస్త భిన్నంగా స్పందించారు. ఒబామా త్వరలోనే దిగిపోతున్నారు.. అయితే, ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఇప్పటి వరకు ఎన్నికైన అధ్యక్షుల్లోనే చెత్త అధ్యక్షుడు అని ట్రంప్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఒబామా కనీసం తాను అధ్యక్షుడిగానైనా దిగిపోతున్నానని చెప్పారు.

ట్రంప్ను టీవీలో చూస్తున్నప్పుడు మీరెప్పుడైనా నవ్వారా అని ప్రశ్నించగా చాలాసార్లు నవ్వానని అన్నారు. 2011లో సునామీ జపాన్ను చుట్టుముట్టినప్పుడు తాను నిద్రలో నుంచి మేల్కోని అర్థరాత్రి మూడు నాలుగుసార్లు బెడ్పై ఉండే ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. అయితే, తాను ఎప్పుడూ కూడా తెల్లవారు జామున తన స్మార్ట్ ఫోన్ వద్దకు వెళ్లేవాడిని కాదని, తనను విమర్శించేవారిపై ఉదయం మూడు గంటలకే ట్వీట్ ల ద్వారా ఆరోపించే అలవాటు తనకు లేదంటూ ట్రంప్ ను విమర్శించారు. వాస్తవానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం ఓ వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement