అదెలా కుదురుతుంది..!
భార్య: ఏమండీ! నేను చచ్చిపోతే మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
భర్త: నువ్వు పొయ్యాక... నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు డియర్?
భార్య: ఎందుకు చేసుకోకూడదు? మీ కష్టసుఖాలలో పాలుపంచుకోవడానికి ఎవరైనా మనిషి ఉంటే బాగుంటుంది కదా, నా మాట విని, మళ్లీ పెళ్లి చేసుకోండి ప్లీజ్.
భర్త: ఎంత మంచిదానివి బంగారం! నువ్వు పోయాక కూడా నా సుఖం గురించి ఆలోచిస్తున్నావు.
భార్య: అయితే, నేను పోగానే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వండి.
భర్త: నీ కోసం నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. సరేనా డియర్?
భార్య: అయితే కొత్తపెళ్లాంతో కలసి ఈ ఇంట్లోనే కాపరం చేస్తారు కదా.
భర్త: అవును, కానీ, ఆమెను నీ గదిలోకి అడుగు కూడా పెట్టనివ్వను.
భార్య: ఆమె నా కారు డ్రైవ్ చేస్తుంది కదా?
భర్త: లేదు, అది నీ జ్ఞాపకంగా దాచుకుంటాను. దానికి కొత్త కారు కొనిస్తాను.
భార్య: అయితే ఆమె నా నగలన్నీ పెట్టుకుంటుంది కదా..
భర్త: లేదు, నీ జ్ఞాపకాలని మరొకరితో పంచుకుంటానా? అయినా, అందుకు ఆమె ఒప్పుకోదు. కొత్తవి కొనిమ్మంటుంది.
భార్య: అయితే ఆమె నా కొత్త చెప్పులు తొడుక్కుంటుందేమో?
వెంటనే భర్త...
‘‘అదెలా కుదురుతుంది? ఆమెదేమో 7వ నంబరు. నీ సైజు 9 కదా’’ అని నాలుక్కరుచుకున్నాడు.
కొద్దిసేపు నిశ్శబ్దం...
కట్ చేస్తే బంధుమిత్రులందరికీ భార్యనుంచి ఫోన్... ‘‘మా ఆయన సడెన్‌గా పోయాడు, అంత్యక్రియలు రేపే, మీరందరూ తప్పకుండా రావాలి’’
....!!!...???
వాటే టచింగ్ స్టోరీ!??
ఫన్ స్పేస్
Published Tue, May 19 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM
Advertisement
Advertisement