
టిక్కెట్ల లెక్కలు... చక్రాల ట్రిక్కులు
ఫన్
‘‘ఒరేయ్ చింటూ... అనులోమానుపాతానికి మంచి ఉదాహరణ చెప్పరా’’ అడిగారు టీచర్.
‘‘బస్సు పొడవు పెరిగిన కొద్దీ టికెట్ ధరా పెరుగుతుంది. అంటే మినీ బస్‌లో కంటే డీలక్స్‌లోనూ, దాని కంటే హైటెక్ బస్సులో టికెట్ ధర ఎక్కువ’’ అన్నాడు చింటూ.
‘‘ఇలాంటిదే మళ్లీ విలోమానుపాతానికి ఉదాహరణ చెప్పు’’
‘‘వాహనానికి చక్రాలు తగ్గిన కొద్దీ రేటు పెరుగుతుంది. అంటే ఆరు చక్రాల బస్సు టికెట్ కంటే మూడు చక్రాల ఆటోకు ఫేర్ ఎక్కువ’’ చెప్పాడు చింటూ. ఇక ఆరుచక్రాల బస్సు టికెట్ ధర కంటే... అనేక చక్రాల రైలు టిక్కెట్టు ఇంకా చవక’’ చెప్పాడు చింటూ.