ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలకు నెంబర్ల కేటాయింపు
Published Sat, Nov 19 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
– పట్టభద్రులకు 112, ఉపాధ్యాయులకు 54 పోలింగ్ కేంద్రాలు
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి ఎన్నికలకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు జిల్లా అధికారులు నెంబర్లు కేటాయించారు. పట్టభద్రుల విభాగంలో 87057 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు 112 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి 225 నుంచి 336 వరకు నెంబర్లు ఇచ్చారు. వైఎస్‌ఆర్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు 1 నుంచి నెంబర్లు ఇచ్చారు. తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లా పోలింగ్ కేంద్రాలకు నెంబర్లు ఇచ్చారు. ఉపాధ్యాయుల విభాగానికి 7419 ధరఖాస్తులు వచ్చాయి. వీటికి 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి 118 నుంచి 171 వరకు నెంబర్లు కేటాయించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని ఇటీవల జాయింట్ కలెక్టర్ హరికిరణ్ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో కోరారు. అయితే ఒక్క ఫిర్యాదు అందలేదు. దీంతో జిల్లా యంత్రాంగం ఎంపిక చేసిన వాటినే పోలింగ్ కేంద్రాలుగా కొనసాగించనున్నారు.
Advertisement
Advertisement