వేములవాడ: రాజన్న ఆలయంలో పనిచేస్తూ విజిలెన్స్ కేసులు, అవినీతి అక్రమాలు ఎదుర్కొంటున్న, క్రమశిక్షణారాహిత్యానికి గురైన 35 మంది ఆలయ ఉద్యోగుల జాబితాను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపించినట్లు ఆలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈనెల 18న కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆలయ ఉద్యోగులు బదిలీపై వెళ్లిన ఉద్యోగులు, రిటైర్మెంట్లతో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయాలని కోరారు.
సుదర్ఘీకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారితోపాటు విజిలెన్స్ కేసులు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు, క్రమశిక్షణారాహిత్యానికి గురైన వారి జాబితాను సిద్ధం చేసి ఇవ్వాలంటూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వేములవాడ రాజన్న ఆలయం నుంచి నలుగురు ఏఈవోలు, 14 మంది పర్యవేక్షకులు, 17 మంది సీనియర్ అసిస్టెంట్ల జాబితాను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపించినట్లు తెలిసింది.
ఆమేరకు బదిలీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఆలయ ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు. చాలా కాలంగా ఇక్కడే పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు వివిధ కేసులు, సస్పెన్షన్లకు గురైన ఉద్యోగుల్లో మరింత ఆందోళన పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment