బుస్స శ్రీనివాస్ దంపతులనుసన్మానిస్తున్న ఆర్యవైశ్యులు
వేములవాడ: వేములవాడ వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడిగా బుస్స శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నికల అఽధికారిగా ఎన్నంపల్లి గంగాధర్ వ్యవహరించారు. ఐదేళ్లపాటు బుస్స శ్రీనివాస్ అధ్యక్షుడిగా కొనసాగుతారని ప్రకటించారు. ఆమేరకు శుక్రవారం నిత్యాదానసత్రంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు సమావేశమయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న బుస్స శ్రీనివాస్ దంపతులను సన్మానించారు.
సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నా కృష్ణ, పట్టణాధ్యక్షుడు రేణికింది అశోక్, మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, నాయకులు కట్కం జనార్దన్, చకినాల అశోక్, చేపూ రి నాగరాజు, రమేశ్, కొండూరి సత్యనారాయణ, దై త కుమార్, వేణు, బుస్స బుచ్చిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment