రవీందర్‌సింగ్‌ను కలిసిన రేషన్‌డీలర్ల సంఘం నాయకులు
సిరిసిల్ల: రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ప్రకటించాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్‌కు రాష్ట్ర రేషన్ డీలర్లు శుక్రవారం వినతిపత్రం అందించారు. కరీంనగర్‌లోని ఆఫీస్‌లో రవీందర్‌సింగ్‌ను కలిసి ఈమేరకు రేషన్‌డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు వినతిపత్రం అందించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి రేషన్‌డీలర్ల సమస్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రవీందర్‌సింగ్ తెలిపారు.
త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్నారు. రేషన్‌డీలర్ల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డిమల్ల హన్మండ్లు, ఉపాధ్యక్షుడు సావనపల్లి రాజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతరాజు రమేశ్, వెంకటేశ్వర్లు, రేషన్‌డీలర్ల సంఘం నాయకులు ఆకునూరి బాలరాజు, వావిలాల ఆనందం, నర్సయ్య, రాజు, గాజుల శ్రీనివాస్, బందం మధు, తాటి వెంకన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment