
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్
సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో నెరవేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు. హైదరాబాద్ నుంచి ఆమె శుక్రవారం సాయంత్రం మున్సిపల్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు, కంటివెలుగు, జీవో 58, 76 ప్రకారం క్రమబద్ధీకరణలు, పోడుభూములకు పట్టాల పంపిణీ, ఆయిల్‌పామ్ సాగుపై శాంతికుమార్ మాట్లాడారు.
జిల్లాలోని అంశాలపై కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అమలుచేయాల్సిన అంశాలపై శాఖలవారీగా సమీక్షించారు. వేగంగా ప్రభుత్వ లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగాలన్నారు. అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీవో టి.శ్రీనివాస్‌రావు, డీటీవో బాలమణి, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, జిల్లా ఉద్యానవన అధికారి జ్యోతి, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment