
మౌనిక (ఫైల్)
బోయినపల్లి(చొప్పదండి) : హాస్టల్‌లో ఉండి చదువుకోవ డం ఇష్టం లేక మండలంలోని కొదురుపాకకు చెందిన కుడుదుల మౌనిక (16) మంగళవారం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ రుద్ర క్రిష్ణకుమార్ కథనం ప్రకారం.. మౌనిక కరీంనగర్‌లోని ప్రభుత్వకళాశాలలో ఇంట ర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లి రావడానికి బస్సులో అప్‌అండ్‌డౌన్ చేస్తోంది. తల్లిదండ్రులు ప్రయివేటు హాస్టల్‌లో ఉండి చదువుకొమ్మని చెప్పారు.
తాను హాస్టల్‌లో ఉండనని తల్లిదండ్రులతో గొడవ పడింది. ఈ నెల 15న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తండ్రి దేవయ్య 16న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన మౌనిక ఇం టికి చేరింది. 17న పోలీసుల కౌన్సెలింగ్‌లో తనకు హాస్టల్ లో ఉండడం ఇష్టం లేదని చెప్పింది. మంగళవారం హాస్టల్‌లో ఉండే విషయంలో ఇంట్లో మళ్లీ గొడవ జరిగింది.
ఆవేశంతో తన బెడ్‌రూంలోకి వెళ్లి తలుపు గడియ వేసుకుని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తలుపు ఎంత బాదినా రాలే దు. దీంతో జేసీబీతో తలుపులు తీయించారు. అప్పటికే మౌనిక పూర్తిగా కాలి చనిపోయింది. మృతు రాలి తండ్రి కుడుదుల దేవ య్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment