నిర్మల్ (చైన్‌గేట్) : కోవిడ్ ఆంక్షలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ–చలాన్ ద్వారా వేసిన జరిమానాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు ఈ నెల 31 వరకు ఉంది. ప్రభుత్వం ప్రకటించిన రాయితీకి జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మార్చి1 నుంచి వర్తింపజేసిన రాయితీని జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 45 శాతం మందే వినియోగించుకున్నారు. మరో 55 శా తం మంది ఇంకా స్పందించడం లేదు. జిల్లా వ్యా ప్తంగా వేల సంఖ్యలో వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపినందుకు పోలీసులు ఈ–చలాన్ ద్వారా జరిమానా విధించారు. అ యితే ఈ చలాన్ చెల్లింపునకు ప్రభుత్వం రాయితీ కల్పించింది. దీంతో గడిచిన 25 రోజుల్లో జరిమానా విధించిన వారిలో సగం మంది కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ట్రాఫిక్ పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు ముందుకు రాని పరిస్థితి.
ఈ–చలాన్‌పై అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఎస్సై దేవేందర్
38 నెలల కాలంలో...
పోలీసులు 38 నెలల కాలంలో 4,41,996 ఈ–చలానా కేసులు నమోదు చేయగా రూ.20 కోట్లకు పై గా వసూలు కావాల్సి ఉంది. కానీ వీరిలో 2,76,659 మంది మాత్రమే 25 రోజుల్లో రాయితీతో కూడిన రూ.7,32,70,585 పెండింగ్‌లో ఉన్న ఈ– చలాన్ జరిమానా చెల్లించారు. అంటే 50 శాతం మంది కూడా చెల్లించకపోవడం గమనార్హం. ఫిబ్రవరిలోగా మరో 1,65,337 కేసులకు సంబంధించిన ఈ–చలనా డబ్బులు 13,30,40,955 చెల్లించాల్సి ఉంది.
జరిమానాలు ఇలా..
కరోనా, లాక్ డౌన్ సమయంలో మాస్కులు లేకుండా తిరిగిన వారికి ఈ చలానా రూ.1000 విధించా రు. ఇందులో వారు కేవలం రూ.100 చెల్లిస్తే చాలు మిగిలిన రూ.900 మాఫీ వర్తిస్తుంది. ద్విచక్ర వాహనదారులకు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలకు 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా 50 శాతం మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు.
ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు
వాహనాలకు విధించిన చలానా చెల్లించేందుకు ఆన్‌లైన్‌లో తెలంగాణ శాఖకు చెందిన http:// echalian. tspolice.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో వాహనం నంబరు ఎంటర్ చేయగానే పెండింగ్ చలానాల వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. పెండింగ్ చలాన్ల సంఖ్య, మొత్తం జరిమానాతో పాటు తాజా రాయితీ తర్వాత ఎంత చెల్లించాలనే వివరాలన్నీ వస్తాయి. పేమెంట్‌పై క్లిక్ చేయగానే గేట్వేలు కనిపిస్తాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.
సద్వినియోగం చేసుకోండి
పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు సద్విని యోగం చేసుకోవాలి. ఈ నెల 31లోగా రాయితీ చలాన్లు చెల్లించకపోతే గడువు ముగిసిన తర్వాత పోలీసులు విధించిన మొత్తం జరిమానా చెల్లించా ల్సి ఉంటుంది.
– రావుల దేవేందర్, ట్రాఫిక్ ఎస్సై
Comments
Please login to add a commentAdd a comment