అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రత నిపుణుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రోజుకో కొత్త మోసానికి తెరతీస్తున్నారు సైబర్ నేర గాళ్లు. ప్రజల్లో అవగాహన పెరిగిన మోసాలు కాకుండా సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో వల వేస్తున్నారు. తాజాగా వాహన దారులను ఈ–చలాన్ల పేరిట నకిలీ ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ భద్రత నిపుణు లు తెలిపారు. పోలీసుల నుంచే వచ్చినట్లుగా అనిపించే నకిలీ వెబ్‌సైట్ లింకులను పంపుతున్నారు. వాటిపై క్లిక్ చేసిన తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ పేరిట బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలు సేకరించి అందినకాడికి సొమ్ము కొల్లగొడుతున్నారు.
తాజాగా ముంబైలో ఈ తరహా కేసు ఒకటి నమోదైనట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ముంబైలోని పెద్దార్‌రోడ్ ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడికి ఇలా నకిలీ మెసేజ్ పంపి పలు దఫాల్లో రూ.3 లక్షలు కొట్టే సినట్లు వెల్లడించారు. ‘వాహన్‌పరివాహన్. ఏపీకే (vahanaparivahan.apk)అనే మొబైల్ యాప్ పేరిట ఈ లింక్ పంపినట్లు తెలిపారు. ఈ–చలాన్ చెల్లించాలంటే ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ సాధారణ మెసేజ్‌ల తోపాటు వాట్సాప్ సందేశాలను వారు పంపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి సరికొత్త సైబర్ మోసాలపై ఎప్పటిక ప్పుడు అవగాహన కలిగి ఉండటంతోపాటు అప్రమత్తంగాను ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment