cyber robbery
-
ఈ–చలాన్ల పేరిట సైబర్ మోసం...
సాక్షి, హైదరాబాద్: రోజుకో కొత్త మోసానికి తెరతీస్తున్నారు సైబర్ నేర గాళ్లు. ప్రజల్లో అవగాహన పెరిగిన మోసాలు కాకుండా సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో వల వేస్తున్నారు. తాజాగా వాహన దారులను ఈ–చలాన్ల పేరిట నకిలీ ఎస్ఎంఎస్లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ భద్రత నిపుణు లు తెలిపారు. పోలీసుల నుంచే వచ్చినట్లుగా అనిపించే నకిలీ వెబ్సైట్ లింకులను పంపుతున్నారు. వాటిపై క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ పేరిట బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలు సేకరించి అందినకాడికి సొమ్ము కొల్లగొడుతున్నారు. తాజాగా ముంబైలో ఈ తరహా కేసు ఒకటి నమోదైనట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ముంబైలోని పెద్దార్‌రోడ్ ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడికి ఇలా నకిలీ మెసేజ్ పంపి పలు దఫాల్లో రూ.3 లక్షలు కొట్టే సినట్లు వెల్లడించారు. ‘వాహన్‌పరివాహన్. ఏపీకే (vahanaparivahan.apk)అనే మొబైల్ యాప్ పేరిట ఈ లింక్ పంపినట్లు తెలిపారు. ఈ–చలాన్ చెల్లించాలంటే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సాధారణ మెసేజ్‌ల తోపాటు వాట్సాప్ సందేశాలను వారు పంపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి సరికొత్త సైబర్ మోసాలపై ఎప్పటిక ప్పుడు అవగాహన కలిగి ఉండటంతోపాటు అప్రమత్తంగాను ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. -
హ్యాకింగ్‌తో 673 కోట్ల చోరీ
బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా ఢాకా: అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ లో ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ ఖాతా నుంచి సుమారు 10.1 కోట్ల డాలర్ల (రూ.673 కోట్లు) సొమ్ము గల్లంతైన ఉదంతంపై బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అతీవుర్ రహ్మాన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి షేక్ హసీనాను కలసి రహ్మాన్ తన రాజీనామా లేఖను అందజేశారని ప్రధాని కార్యాలయ ప్రతినిధి ఇషానుల్ కరీం మీడియాకు తెలిపారు.అమెరికా బ్యాంకు ఖాతాలో ఉన్న బంగ్లా ప్రభుత్వ నిధులను గుర్తుతెలియని హ్యాకర్లు కొల్లగొట్టడం సంచలనం సృష్టించింది. కొన్ని వారాల కిందట వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బంగ్లా ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఏడేళ్లపాటు ఈ పదవిలో ఉన్న రహ్మాన్ అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, దేశ హితం కోసం తాను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలి పారు. నిధుల దొంగిలింపు వ్యవహారం మిలిటెంట్ల దాడిలా ఉంద న్నారు. హ్యాకర్లు 10.1 కోట్ల డాలర్లను కొల్లగొట్టారని, 8.1 కోట్ల డాలర్లు ఫిలిప్పీన్స్‌కు, మిగతా డబ్బులు శ్రీలంకకు తరలించారని బ్యాంకు ప్రతినిధి తెలిపారు. శ్రీలంకకు చేరిన సొమ్ములోంచి కొంత రికవరీ చేశామని, ఫిలిప్పీన్స్‌కు చేరిన సొమ్ము క్యాసినోల వ్యాపారంలోకి మళ్లించి నట్లు తెలిసిందన్నారు. హ్యాకర్లు బంగ్లా ప్రభు త్వ రహస్య సమాచారాన్ని దొంగిలించి ప్రభుత్వం నుంచి వచ్చినట్లుగానే నిధుల బదిలీకి అభ్యర్థనలు పంపారని, అయితే శ్రీలంకలోని ఒక సంస్థకు బదిలీకి సంబంధించి స్పెల్లింగ్ తప్పుగా ఇవ్వడంతో పునఃపరిశీలన చేయగా వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. -
బ్యాంకు నుంచి 540 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు
బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్న అతిపెద్ద రాబరీ సెంట్రల్ బ్యాంకు చీఫ్ రాజీనామా చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీ బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్నది. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ ద్వారా బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు నుంచి రూ. 540 కోట్లు (40 మిలియన్ డాలర్లు) కొల్లగొట్టడం దుమారం రేపుతున్నది. ఈ వ్యవహారంలో సెంట్రల్ బ్యాంకు గవర్నర్ అతివుర్ రహ్మాన్ తన పదవికి రాజీనామా చేసినట్టు బంగ్లాదేశ్ ఆర్థికమంత్రి మంగళవారం వెల్లడించారు. తన సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకొన్నట్టు చెప్పారు. మానవ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ రాబరీగా ఈ దొంగతనం నిలిచిపోయింది. దీంతో బంగ్లాదేశ్ వద్ద ఉన్న 27 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యానికి భద్రత ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ దోపిడీ వ్యవహారం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ అమెరికా ఖాతాలో బిలియన్ డాలర్ల (రూ. 6,740 కోట్ల)ను దోచుకోవడానికి హ్యాకర్లు ప్రయత్నించారని, అయితే డబ్బు ట్రాన్స్ఫర్ విజ్ఞప్తికి చివరినిమిషంలో రెడ్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఈ దోపిడీని చాలావరకు నిరోధించామని బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు చెప్తోంది. అమెరికా రిజర్వు బ్యాంకు అయిన న్యూయార్క్ ఫెడ్‌లోని బంగ్లా ఖాతా నుంచి డబ్బు ఉపసంహరణకు హ్యాకర్లు 35 విజ్ఞప్తులు పంపడమే కాకుండా, బ్యాంకుల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్‌ను వాడుకొని డబ్బు యావత్తును ఊడ్చిపారేసేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో అమెరికా రిజర్వు బ్యాంకు సిస్టం సరిగ్గా పనిచేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, అది మాత్రం ఆరోపణలను తోసిపుచ్చుతోంది. హ్యాకర్ల నుంచి భారీగా సొమ్ము రికవరీ చేశామని, నేరగాళ్ల నుంచి దోపిడీకి గురైన మిగతా డబ్బు కూడా రాబట్టేందుకు ఫిలిపీన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని బ్యాంకు అధికారులు చెప్తున్నారు.