చలానా విధిస్తున్న ట్రాఫిక్ పోలీస్(ఫైల్)
నిర్మల్: కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో విధించిన ఫైన్లపై రాయితీ ప్రకటించింది. ఈనెల 26 నుంచి జనవరి 10 వరకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని పేర్కొంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రానప్పటికీ దాదాపు ఇదే ఫైనల్ అని, పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాదారులు ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
బంపర్ డిస్కౌంట్లు..
గత ప్రభుత్వం 2022లో ఇలాగే చలాన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. దీంతో అప్పట్లో చాలామంది వాహనదారులు తమ పెండింగ్ చలాన్‌లు క్లియర్ చేసుకున్నారు. సర్కారుకూ ఆదాయం సమకూరింది. ఇప్పుడు కొత్త సర్కారు కూడా అలాగే భారీ ఆఫర్లతో పెండింగ్ జరిమానాలను క్లియర్ చేయించే పనిపెట్టుకుంది. ఈనెల 26 నుంచి జనవరి 10 వరకు సమయం ఇచ్చింది.
జిల్లాలో భారీగానే..
జిల్లాలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇందులో చాలామంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వెళ్తున్నారు. ఎ క్కువశాతం హెల్మెట్ లేకుండా, రాంగ్‌రూట్‌లో ప్ర యాణం, అతివేగం వంటివే ఉంటున్నాయి. రోడ్డుభద్రత నిబంధనలను ఉల్లంఘించిన వారికి పోలీ సులు సంబంధిత చలాన్లు విధిస్తున్నారు. చాలా మంది వాహనదారులు తమకు తెలియకుండానే ని బంధనలు అతిక్రమిస్తూ చలానాల బారిన పడుతున్నారు. ఎప్పుడో ఒకసారి ఎక్కడైనా పోలీసులు ఆపి తనిఖీ చేసినప్పుడే అసలు విషయం బయటపడుతోంది. మన వాహనంపై పెండింగ్ చలాన్‌లు ఉ న్నాయా.. లేదా.. అని తెలంగాణ పోలీస్‌శాఖ ఆన్‌లైన్‌లో ఈ–చలాన్ ద్వారా తెలుసుకోవచ్చు.
కట్టేసిందే.. ఉత్తమం..
కొత్త ప్రభుత్వం వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ల చెల్లింపులకు ఇచ్చిన ఆఫర్లపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇలాంటి ఆఫర్ మళ్లీ ఇస్తారో లేదోనని చాలామంది భావిస్తున్నారు. అలాగే ఈ గడువు ముగిసిన తర్వాత మరింత పకడ్బందీగా తనిఖీలు చేపట్టి, ఇబ్బందులు పెడతారేమోనన్న చర్చ కూడా సాగుతోంది. ఎప్పటికై నా కట్టాల్సినవే కనుక ఇప్పుడున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు.
ఎప్పటికై నా చెల్లించాల్సిందే..
వాహనదారులు తమ వాహనంపై ఉన్న చలాన్లను ఎప్పటికై నా చెల్లించాల్సిందే. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్లను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. జిల్లాలోని వాహనదారులంతా పెండింగ్ చాలన్లను క్లియర్ చేసుకోవాలి.
– ప్రవీణ్‌కుమార్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment