సాక్షి, న్యూఢిల్లీ: క్యాబ్ షేరింగ్‌కు చెక్ పెట్టే దిశగా ఢిల్లీ సర్కార్ ప్రయత్నిస్తుంటే సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు క్యాబ్ యూజర్లకు ఊరట ఇస్తున్నాయి. క్యాబ్ షేరింగ్ మంచి ఐడియానే అని, అయితే మహిళ భద్రత గురించి ఆలోచించాల్సి ఉందన్నారు. కొత్త వారితో కలిసి క్యాబ్‌లో వెళ్లడం మహిళల భద్రతకు ఇబ్బందికరమని అన్నారు.
యాప్ ఆధారిత క్యాబ్ షేరింగ్ సేవల్లో మహిళల భద్రతపైనే రవాణా అధికారులతో, సంబంధిత వర్గాలతో చర్చిస్తున్నామని చెప్పారు. రైడ్ షేరింగ్‌కు అనుమతిస్తూనే మహిళల భద్రతకు పెద్దపీట వేసేలా సూచనలు చేయాలని కేజ్రీవాల్ ఆహ్వానించారు. మొత్తం మీద క్యాబ్ షేరింగ్ నిషేధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయంతో ముందుకొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment