ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా క్యాబ్‌లోకి లాక్కెళ్లి.. | Delhi Man Abuses Woman Forces Her Into Cab Viral Video | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా క్యాబ్‌లోకి లాక్కెళ్లి..

Published Sun, Mar 19 2023 2:15 PM | Last Updated on Mon, Mar 20 2023 5:51 AM

Delhi Man Abuses Woman Forces Her Into Cab Viral Video - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతిని యువకుడు బలవంతంగా క్యాబ్‌లోని ఎక్కించాడు. ఆమెను దుర్భాషలాడుతూ చొక్కా పట్టుకుని లాక్కెళ్లి కారులో పడేశాడు. కారుకు అటువైపు మరో యువకుడు కూడా నిలబడి ఉన్నాడు.

మంగోల్‌పురిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు దేశ రాజధానిలో అమ్మాయిలకు భద్రత లేదా? ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వీడియోను సుమోటోగా తీసుకుని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.  యువతిని వేధించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ రికార్డులను పరిశీలించారు.

ఇద్దరు యువకులు, ఓ యువతి రోహిణి నుంచి వికాస్‌పుర్‌ వరకు వెళ్లేందుకు ఈ క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వీరి మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత యువతి రానని చెప్పగా.. బలవంతంగా తీసుకెళ్లారని వివరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
చదవండి: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. ఢిల్లీలో టెన్షన్‌ టెన్షన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement