న్యూఢిల్లీ : దేశ రాజధాని నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో ఓ మహిళను భర్త సోదరుని కుమారులు చితకబాదారు. ఈ ఘటన ఢిల్లీలోని జగత్‌పూరిలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గత కొద్ది రోజుల నుంచి ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ వివాదాల్లో పెద్ద అన్న భార్య తలదూర్చింది. దీంతో ఆవేశానికి లోనైన మరిది కుమారులు.. ఆమెను నడిరోడ్డుపై చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment