లేడీ కాదు ఇంటర్నేషనల్‌ కేడీ | Woman Arrested For Smuggling Drugs In Delhi Airport | Sakshi
Sakshi News home page

లేడీ కాదు ఇంటర్నేషనల్‌ కేడీ

May 21 2018 10:21 AM | Updated on May 21 2018 2:21 PM

Woman Arrested For Smuggling Drugs In Delhi Airport - Sakshi

పట్టు బడ్డ సౌత్‌ అమెరికన్‌ కొకైన్‌ క్యాప్సల్స్‌

న్యూఢిల్లీ : హీరో సూర్య ‘వీడొక్కడే’ సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే సీన్‌.. కొకైన్‌ క్యాప్సుల్స్‌ను కడుపులో ఉంచుకుని స్మగ్లింగ్‌ చేయడం. మరి దర్శకుడు కేవీ ఆనంద్‌ నిజ జీవితంలో జరిగిన సన్నివేశాన్ని అలా తీశారో ఏమో తెలియదు కాని. అచ్చం అలాంటి సీనే ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగు చూసింది. బ్రెజిల్‌ కు చెందిన ఓ మహిళ తన కడుపులో 106 క్యాప్సుల్స్‌ను  స్మగ్లింగ్‌ చేస్తూ ఢిల్లీ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులకు పట్టుబడింది.

వివరాల్లోకి వెళితే.. ఈ నెల14న బ్రెజిల్‌కు చెందిన 25 ఏళ్ల యువతి ఢిల్లీలోని ఓ నైజీరియన్‌ వ్యక్తికి సరుకు అందజేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. కొకైన్‌ అందితే ఐదువేల డాలర్లు ఆమెకు ఇచ్చేలా బేరం కుదిరింది. ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఉన్న ఆ నైజీరియన్‌కు దీన్ని చేరవేయడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆమెను స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానించారు. యువతిని హాస్పిటల్‌కు తరలించి ఎక్స్‌రే తీసి పరీక్షించగా అసలు విషయం బయటపడింది.

ఆమె కడుపులో 930 గ్రాముల సౌత్‌ అమెరికన్‌ కొకైన్‌ క్యాప్సుల్స్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి విలువ దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసలు తెలిపారు. నేరాన్ని అంగీకరించిన ఆమె తన రెండవ భర్త కారణంగానే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిపింది. ఆదివారం ఆమెను సిటీ కోర్టు ఎదుట హాజరుపర్చిన పోలీసులు నేరం నిరూపణ కావటంతో తీహార్‌ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement