cocaine smuggling
-
బ్యాగ్‌ల అడుగున దాచి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడింది. బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్ల విలువ చేసే ఐదు కిలోల కొకైన్‌ను డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు శుక్రవారంస్వాధీనం చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగ్‌ల కింద దాచి ఉంచిన కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ మేరకు డీఆర్ఐ అధికారులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. లావోస్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్‌కు శుక్రవారం చేరుకున్నాడు. అతడు హైదరాబాద్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా, పక్కా సమాచారం మేరకు అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. సూట్‌కేస్, నాలుగు మహిళా హ్యాండ్ బ్యాగ్‌ల అడుగు భాగంలో దాచి ఉంచిన కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో మొత్తం ఐదు కిలోల కొకైన్ ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రయాణికుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ డ్రగ్ సిండికేట్‌లోని మరికొందరు ముఠా సభ్యులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. -
ముంబై, గుజరాత్ తీరాల్లో రూ.852 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ముంబై/అహ్మదాబాద్: వేర్వేరు తీరప్రాంతాల్లో రూ.852 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు అధికారుల చేతికి చిక్కాయి. మహారాష్ట్రలోని నవీ ముంబై పొరుగున ఉండే నహావా షెవా నౌకాశ్రయంలో ఆపిల్ పండ్ల కంటైనర్‌లో యాభై కేజీల అత్యంత నాణ్యమైన కొకైన్ మాదకద్రవ్యాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఇటుకల్లా ఒక్కోటి కేజీ బరువుండేలా ప్యాక్చేసిన డ్రగ్స్‌ను గ్రీన్ ఆపిల్స్ మధ్యలో అధికారులు కనుగొన్నారు. సముద్రమార్గ కంటైనర్లలో ఇంతటి భారీ స్థాయిలో డ్రగ్స్ దొరకడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ డ్రగ్స్‌ను దక్షిణాఫ్రికా నుంచి స్మగ్లర్లు భారత్‌కు తరలించారు. మొత్తంగా 50.23 కేజీల బరువున్న ఈ డ్రగ్స్ అంతర్జాతీయ విపణిలో ఏకంగా రూ.502 కోట్ల ధర పలుకుతాయని రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. వశీలో ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి బత్తాయి పండ్ల మాటున 198 కేజీల మెథ్, 9 కేజీల కొకైన్‌ను కంటైనర్‌లో తెప్పించిన దిగుమతిదారు వీటినీ తెప్పించాడు. గత వారం నమోదైన కేసులో ఇప్పటికే ఇతడిని పోలీసులు అరెస్ట్చేయడం తెల్సిందే. గుజరాత్లో మరో 50 కేజీలు పాకిస్తాన్ నుంచి వస్తూ గుజరాత్ తీరానికి దూరంగా సముద్రజలాల్లో అడ్డగించిన ఒక పడవలో రూ.350 కోట్ల విలువైన 50 కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం, ఉగ్ర వ్యతిరేక దళాలు స్వాధీనంచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వేళ ఈ ఆపరేషన్ నిర్వహించారు. అల్ సకర్ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్తానీయులను అరెస్ట్‌చేసి అధికారులు విచారిస్తున్నారు. ఉత్తరభారతం, పంజాబ్‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసే పాకిస్తాన్ డ్రగ్ మాఫియా ఈ సరకును పంపించాడని తెలుస్తోంది. -
ఉగాండా మహిళ పొట్టలో కేజీ కొకైన్
న్యూఢిల్లీ: ఉగాండా దేశానికి చెందిన మహిళ నుంచి సుమారు కిలో బరువున్న కొకైన్ అనే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ) కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికురాలు కొన్ని రోజుల క్రితం ఉగాండా నుంచి ఢిల్లీకి వచ్చింది. విమానాశ్రయంలో అధికారులు ఆమె కదలికలు, ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆమె క్యాప్యూళ్ల రూపంలో ఉన్న కొకైన్‌ను మింగినట్లు ఒప్పుకుంది. వెంటనే ఆస్పత్రిలో ఆమెకు పరీక్షలు చేయించగా అనేక క్యాప్యూళ్లు పెద్ద పేగు వద్ద చిక్కుకుని ఉన్నట్లు తేలింది. దీంతో నిపుణుల పర్యవేక్షణలో వాటన్నిటినీ బయటకు తీసేందుకు కొన్ని రోజులు పట్టింది. మొత్తం 992 గ్రాముల బరువున్న 91 క్యాప్సూళ్లు బయటపడ్డాయి. వీటిల్లో ఉన్నది సుమారు రూ.14 కోట్ల విలువైన కొకైన్ అని ధ్రువీకరించుకున్నారు. ఈ మేరకు సదరు మహిళను అరెస్ట్ చేసి, ఈనెల 29వ తేదీన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈనెల మొదటి వారంలో నైజీరియా మహిళ నుంచి ఐజీఐ అధికారులు 2,838 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్ ఫ్రమ్ ఢిల్లీ.. కొరియర్లో కొకైన్ సరఫరా
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ నుంచి కొరియర్లో మాదకద్రవ్యమైన కొకైన్‌ను నగరానికి అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ముఠాలో ఓ నైజీరియన్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఆదివారం పట్టుకున్నారు. ఇతడికి ఈ డ్రగ్ సరఫరా చేస్తున్న వ్యక్తి సైతం నైజీరియనే అని డీసీపీ చక్రవర్తి గుమ్మి పేర్కొన్నారు. నైజీరియాలోని లాగోస్ రాష్ట్రానికి చెందిన డేనియల్ అయోటుండే ఓలమెడే 2014లో స్టూడెంట్ వీసాపై నగరానికి వలసవచ్చాడు. షేక్‌పేటలోని డ్రీమ్ వ్యాలీ సమీపంలో నివసిస్తూ కూకట్‌పల్లిలోని ప్రైవేట్ కాలేజీ నుంచి డిగ్రీ చదువుతున్నాడు. డ్రగ్స్ వినియోగానికి బానిసగా మారిన ఇతడికి ఢిల్లీలో ఉండే మరో నైజీరియన్ జాన్ పాల్‌తో పరిచయం ఏర్పడింది. చదవండి: హైదరాబాద్: స్టాంప్ పేపర్లు కావలెను! ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నారు. జాన్ అప్పుడప్పుడు నేరుగా వచ్చి, మిగిలిన సందర్భాల్లో కొరియర్ ద్వారా కొకైన్ పంపుతున్నాడు. దీన్ని డేనియల్ నగరంలోని కస్టమర్లకు ఒక్కో గ్రాము రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నాడు. ఇలా వచ్చిన లాభాన్ని ఇద్దరూ సమానంగా పంచుకుంటున్నారు. ఇదే ఆరోపణలపై గతేడాది అక్టోబర్‌లో లంగర్‌హౌస్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ కేసులో జాన్ ఇప్పటికీ వాంటెడ్‌గా ఉన్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన డేనియల్ తన పంథా మార్చుకోకుండా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు. చదవండి: హైదరాబాద్ ఆర్టీసీ: ఇక అందరికి రూట్ పాస్‌లు! దీనిపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, కె.చంద్రమోహన్ వలపన్నారు. ఆదివారం జీవీకే సమీపంలో ద్విచక్రవాహనంపై డ్రగ్స్ డెలివరీ చేయడానికి వెళ్తున్న డేనియల్ను పట్టుకున్నారు. ఇతడి నుంచి నాలుగు గ్రాముల కొకైన్, వాహనం స్వా«దీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న జాన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
‘గర్ల్‌ఫ్రెండ్ వచ్చిన మరుసటి రోజే పట్టుబడ్డాను’
హిమాయత్‌నగర్: ఇటీవల నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొకైన్ అమ్ముతూ పట్టుబడ్డ ఘనా దేశస్థుడు జోసఫ్‌కు జూన్ 24న కోర్టు రిమాండ్ విధించింది. మరింత సమాచారం కోసం నారాయణగూడ పోలీసులు సోమవారం జోసఫ్‌ను కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో పలు విషయాలను అతను బయటపెట్టాడు. లిల్లీ నుంచే సరుకు... ముంబాయిలో అక్కడి ఫ్రెండ్స్ ద్వారా పరిచయ మై న లిల్లి అనే వ్యక్తి నుంచి కొకైన్ వంటి మాదక ద్రవ్యా లను ఒక్కో గ్రాము సుమారు రూ.4వేలకు ఇచ్చేవా డని, దానిని తాను రూ.5వేల నుంచి రూ.6వేలకు ఇతరులకు అమ్మేవాడినంటూ చెప్పినట్లు తెలిసింది. ముంబాయి నగరంలో కోవిడ్ కారణంగా లాక్డౌన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో అక్కడి పబ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్ మూతపడడంతో హైదరాబాద్‌లో అమ్మాలనే ఆలోచనతో నెల రోజుల క్రితం ముంబై నుంచి బస్సులో నగరానికి వచ్చి కొద్దిరోజుల పాటు తెలిసిన స్నేహితుల వద్ద నివాసం ఉన్నాడు. రాజమోహల్లా ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు ఉందని పేపర్ యాడ్‌లో చూసి ఆ ఇంటి వారికి పాస్‌పోర్ట్ చూపించి ఇద్దరం ఉంటామని అద్దెకు దిగాడు. డూ యూ హ్యావ్ స్టఫ్ అన్న వారికే... నేను ఎవరి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తానని చెప్పన్నక్కర్లేదు. నా ముఖం చూసి వారే ‘డూ యూ హ్యావ్ స్టఫ్’ అంటూ అడుగుతారు. అలా అడిగిన వారికి మరుసటి రోజు సాయంత్రం లేదా ఆ తర్వాతిరోజు(ఎల్లుండి) సాయంత్రం ఏదైనా ల్యాండ్‌మార్క్ చెప్పేవాడిని. అలా అక్కడకు వచ్చిన వారికి నా వద్ద ఉన్న కొకైన్ అమ్మకాలు చేశాను. ఇక నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను చూడటానికి వచ్చిందని అనుకుంటున్నాను. ఆమె వచ్చిన మరుసటి రోజే నేను పోలీసులకు పట్టుబడ్డాను కాబట్టి ఇంకా వేరే కారణాలు తెలియవంటూ పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఎంత సరుకు అమ్మావు, ముంబై నుంచి ఎంత సరుకు తెచ్చావు, ఇక్కడ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే సమాధానాలను మాత్రం పోలీసులు జోసఫ్ నుంచి రాబట్టలేకపోయారు. -
రూ.1000 కోట్లు విలువైన కొకైన్ పట్టివేత
తూత్తుకుడి: విమానాశ్రయాలు బంగారు అక్రమ రవాణాకు అడ్డ అయితే.. ఓడరేవులు డ్రగ్స్ సరఫరాకు అడ్డాగా మారుతున్నాయి. తమిళనాడులో మైండ్ బ్లాంక్ అయ్యేలా భారీ ఎత్తున మత్తు పదార్దాలు పట్టుబడుతున్నాయి. తాజాగా ఇతర దేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా వేలాది కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలోని వీవీఓసీ ఓడరేవు వద్ద విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేసిన రూ.1000 కోట్లు విలువైన కొకైన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి ఓడ ద్వారా రవాణా చేస్తున్న సమయంలో ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల తూత్తుకుడిలోని ఓడరేవు వద్దకు వచ్చిన ఓడ కంటైనర్లను అధికారులు తనిఖీ చేస్తున్నప్పుడు ఈ స్మగ్లింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. కలప కంటైనర్‌లోని సంచుల్లో సుమారు 400 కిలోగ్రాముల కొకైన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొకైన్ ఎక్కడ నుంచి వచ్చిందో నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఇంత పెద్ద ఎత్తున భారీగా మాదకద్రవ్యాలను పంపించారో పోలీసులు విచారిస్తున్నారు. కంటైనర్ ఎవరిది? ఇది ఎక్కడ నుండి వచ్చింది.. ఎవరు ఆదేశించారు.. అందులో డ్రగ్స్ ఎవరు పెట్టారో తెలుసుకోవడానికి చెన్నై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు పోర్టు ఉద్యోగులు, అటు నౌక సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలోనూ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయాలు బంగారు అక్రమ రవాణాకు కేంద్రాలుగా మారుతుంటే, ఓడరేవులు మాదకద్రవ్యాల రవాణాకు కేంద్రాలుగా మారుతున్నాయి. తమిళనాడు విమానాశ్రయంలో ఇటీవల జరిపిన సోదాల్లో వందల కిలోల బంగారం అక్రమంగా దొరికింది. షిప్పింగ్ పోర్టులో డ్రగ్స్ రవాణా ఇటీవల పెరిగింది. మాదకద్రవ్యాలను తరచూ రవాణా చేస్తుండగా సీజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. విదేశాల నుంచి నేరుగా డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో పట్టుకోవడం ఇదే మొదటిసారి. 4 వందల కిలోల కొకైన్ విలువ సుమారు 1000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. చదవండి: ఉరి తాడుగా మారిన ఉయ్యాల -
ఆయన కోరిక తీర్చలేదు.. అందుకే ఇలా..
కోల్‌కతా: డ్రగ్స్‌తో పట్టుబడిన పశ్చిమ బెంగాల్ బీజేపీ యూత్ వింగ్ లీడర్ పమేలా గోస్వామి, ఆ పార్టీ సీనియర్ నేత రాకేశ్ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అందుకు తాను ధీటుగా బదులివ్వడంతో ఇలా కుట్ర పన్ని తనను ఇరికించారని ఆరోపించారు. నిజం ఎక్కువ రోజులు దాగదని, తాను చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. కాగా పమేలా గోస్వామి, తన స్నేహితుడితో కలిసి కోల్‌కతాలోని నయా అలీపూర్ ప్రాంతంలోని ఎన్ఆర్ అవెన్యూకు వెళ్తున్న సమయంలో పోలీసులు ఆమె కారును తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 100 గ్రాముల కొకెన్ లభించడంతో అక్కడిక్కడే పోలీసులు పమేలాను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఐదు రోజుల కస్టడీ అనంతరం ఎన్డీపీఎస్ కోర్టు ఎదుట గురువారం ఆమెను హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో కోర్టు బయటకు వచ్చిన పమేలా గోస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరో చేసిన కుట్ర కారణంగా నేను బాధితురాలిగా మారాను. రాకేశ్ సింగ్ నిజంగా ఏ తప్పు చేయకపోయి ఉంటే ఎందుకు పారిపోయారు? ఈ కథ వెనుక ఉన్న అసలు నిజం ఏమిటంటే.. రాకేశ్ సింగ్ నా పట్ల ఆసక్తి కనబరిచారు. కానీ నేను ఆయనను పట్టించుకోలేదు. దీంతో ఆయనకు కోపం వచ్చి ఇలా నన్ను ఇరికించారు. అంతేకాదు గతంలో నన్ను శారీరకంగా వేధించారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే నన్ను బెదిరింపులకు గురిచేశారు. నా ముఖంపై యాసిడ్ పోస్తానని హెచ్చరించారు. మా వాళ్లను చంపుతానని బెదిరించారు’’అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏదో ఒక విధంగా ఇబ్బంది కలిగిస్తారనుకున్నా గానీ ఇలా డ్రగ్స్‌కేసులో ఇరికిస్తారని అనుకోలేదు అని పమేలా వాపోయారు. ఇదిలా ఉంటే.. మమతా బెనర్జీ సర్కారు కక్షపూరిత చర్యల్లో భాగంగా పమేలాను ఇరికించి ఉంటుందంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: డ్రగ్స్‌తో పట్టుబడిన బీజేపీ నాయకురాలు -
డ్రగ్స్‌తో పట్టుబడిన బీజేపీ నాయకురాలు
కోల్‌కతా: కారులో మత్తుపదార్థాలు తరలిస్తున్న బీజేపీ మహిళ నేతతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన మహిళ నాయకురాలిని బీజేపీ యూత్ లీడర్ పమేలా గోస్వామిగా గుర్తించారు. వివరాలు.. శుక్రవారం పమేలా గోస్వామి, తన స్నేహితుడితో కలిసి కోల్‌కతాలోని నయూ అలీపూర్ ప్రాంతంలోని ఎన్ఆర్ అవెన్యూకు వెళ్తున్నారు. అయితే అప్పటికే బీజేపీ నాయకురాలు ఒకరు మత్తు పదార్థాలు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు ఎన్ఆర్ అవెన్యూ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పమేలా గోస్వామి కారులో కొకైన్ తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా.. అందులో మత్తు పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే కారులోని సీట్ల కింద మత్తు పదార్థాలను దాచి ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె దగ్గర నుంచి 100 గ్రాముల కొకైన్‌ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక ఘటన స్థలంలోనే ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పమేలా గోస్వామితో ఆమె ఫ్రెండ్ ప్రబీర్ కుమార్ దేవ్‌తో పాటు ఓ బాడీగార్డు కూడా ఉన్నాడు. దాంతో పోలీసులు పమేలాతో పాటు వీరద్దరిని కూడా అరెస్ట్ చేశారు. పమేలాకు మత్తు పదర్థాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే మత్తు పదార్థాలను ఆమె ఎవరికైనా అందివ్వడానికి తీసుకెళ్తుందా.. లేక ఆమె వాడుతుందా అనే విషయాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పమేలా అరెస్ట్‌పై బీజేపీ నాయుకుల స్పందించారు. ‘‘చట్టం తన పని తాను చేస్తుంది. అయితే ఎవరైనా ఆమె కారులో కొకైన్ పెట్టి ఉండవచ్చు కదా.. ఇది బెంగాల్.. ఇక్కడ ఏమైనా జరగవచ్చు. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్నారు. కాబట్టి నమ్మలేం’’ అన్నారు. తొలుత ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసిన పమేలా ఆ తర్వాత మోడలింగ్, టీవీ సీరియల్స్‌లో నటించారు. 2019లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆమెని తరువాత ఆమెను హుగ్లీ జిల్లాకు యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, యువ మోర్చా పరిశీలకుడిగా నియమించారు. చదవండి: సీజ్: లెహెంగా చాటున కోట్ల దందా ముంబైలో తెలుగు సీరియల్ నటి అరెస్టు -
లాక్డౌన్లో సెలబ్రిటీలకు డ్రగ్స్ చేరవేశారా?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మళ్లీ పెద్దమొత్తంలో నిషేధిత డ్రగ్స్ పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నగరంలోని పంజగుట్ట, లోతుకుంట ప్రాంతాలకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు..వారి వద్ద నుంచి 54 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకోవడంతో నగరంలో మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. నగరంలో సుమారు 22 మంది వీఐపీలకు నిందితులిద్దరూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్డౌన్ ఎఫెక్ట్‌తో నగరంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరగడంతోపాటు..నిషేధిత డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న మాఫియా వీటి ధరలను రెండింతలు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టుకావడంతో పలువురు సినిమా సెలబ్రిటీలను ఆబ్కారీశాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేకంగా విచారించిన విషయం విదితమే. అయితే ఈ నెల 2న అరెస్టుచేసిన తరణ్ జ్యోతిసింగ్, అమిత్కుమార్ల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన కొకైన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ కోవిడ్ మాస్క్‌లను బెంగళూరులో విక్రయిస్తామంటూ పోలీసుల వద్ద పాస్తీసుకొని అక్కడికి వెళ్లి నైజీరియాకు చెందిన మైక్ అనే వ్యక్తి వద్ద నుంచి 70 గ్రాముల కొకైన్ కొనుగోలు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తెలిపారు. వారు అక్కడి నుంచి బయలుదేరి మే 30న హైదరాబాద్ నగరానికి చేరుకున్నారని..మార్గమధ్యంలో నిందితులిద్దరూ సుమారు 16 గ్రాముల కొకైన్ సేవించినట్లు పేర్కొన్నారు. వీరికి డ్రగ్స్ విక్రయించిన మైక్ పరారీలో ఉన్నారన్నారు. కాగా నిందితులు ప్రయాణించిన స్కోడా కారు,మొబైల్ఫోన్లను సైతం పోలీసులు సీజ్‌చేశారు. వీరిలో అమిత్‌కుమార్ అనే నిందితుడు గత 15 ఏళ్లుగా డ్రగ్స్ వాడుతున్నారని..వివిధ నిషేధిత మాదక ద్రవ్యాల కొనుగోలుచేయడంతోపాటు స్వయంగా వాటిని తీసుకునేవారని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఇక మరో నిందితుడు తరణ్ జ్యోత్‌సింగ్ ఐదేళ్లుగా డ్రగ్స్వాడుతున్నారన్నారు. ఇటీవల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేసిన తరణ్జ్యోతిసింగ్, అమిత్‌కుమార్ సెలబ్రిటీలకు చేరవేశారా? నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతి సభ్యసమాజాన్ని కలచివేస్తోంది. డ్రగ్స్ రాకెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న నిందితులు..నగరంలోని యువతరం, సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన సెలబ్రిటీలకు, వీఐపీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీల్లో తరచూ బయటపడుతోంది. అయితే తాజా డ్రగ్స్ రాకెట్లో ఇద్దరు మినహా ఎవరూ నిందితులు లేరని..సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు లేవని ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు పైకి చెబుతున్నా..ఇద్దరు నిందితులు సుమారు 22 మంది వీఐపీలకు సరఫరా చేసినట్టు సమాచారం గుప్పుమంటుండటం గమనార్హం. ఈవిషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక ఆబ్కారీ శాఖ తటపటాయిస్తున్నట్లు సమాచారం. గతేడాది సినీ ప్రముఖుల డ్రగ్స్ రాకెట్గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేసినా..ఈ స్కామ్‌లో సూత్రధారులు, పాత్రధారులపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. రెండింతల ధరలు... అత్యంత ధరపలికే నిషేధిత మాదకద్రవ్యాలను డ్రగ్స్ మాఫియా లాక్డౌన్ ఎఫెక్ట్‌తో రెండింతల ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. సుమారు గ్రాముకు ఐదు వేల విలువైన డ్రగ్స్‌ను సుమారు పది లేదా పదిహేను వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తాజాగా పట్టుబడిన డ్రగ్స్ సుమారు రూ.5 లక్షల విలువ కాగా..దీన్ని సొమ్ముచేసుకున్న పక్షంలో నిందితులకు పది నుంచి రూ.15 లక్షలు కొల్లగొట్టేవారిని ఆబ్కారీపోలీసులు చెబుతున్నారు. సెలబ్రిటీలకు, వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేయలేదు ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో పట్టుబడిన నిందితుల కేసును తదుపరి విచారణ నిమిత్తం సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పజెప్పాం. తాజా డ్రగ్స్ కేసులో నిందితులు ఇద్దరు డ్రగ్స్ సేవించారు. సెలబ్రిటీలు, వీఐపీలు ఎవరికీ డ్రగ్స్ సరఫరా చేయలేదని మా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గతేడాది నమోదైన పాత కేసుకు సంబంధించిన పాత వివరాలతో కొన్నిప్రసార మాధ్యమాలు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం. సెలబ్రిటీలకు, వీఐపీలకు చేరవేసినట్లు ఎలాంటిఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నాం. – ఎన్.అంజిరెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్‌సూపరింటెండెంట్, ఎన్ఫోర్స్మెంట్ -
ఇటుదటు... అటుదిటు!
సాక్షి, సిటీబ్యూరో: నగరం కేంద్రంగా వ్యవస్థీకృత మాదకద్రవ్యాల దందాకు పాల్పడుతున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ఫ్రాన్సిస్ జేవియర్ కుటుంబం పాతికేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి కార్ఖానా ప్రాంతంలో స్థిరపడింది. ఇంటర్మీడియట్‌తో చదువు మానేసిన ఫ్రాన్సిస్ ఆపై దురలవాట్లకు బానిసగా మారాడు. మాదకద్రవ్యాలు వినియోగించడం మొదలు పెట్టిన అతడికి ఆరు నెలల క్రితం ప్రస్తుతం గోవాలో ఉంటున్న సికింద్రాబాద్ వాసి ఆర్ఎం గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. తరచు సిటీకి వచ్చి వెళ్తున్న ఆర్ఎం గౌడ్ తనతో పాటు కొన్ని డ్రగ్స్ తీసుకువచ్చి ఫ్రాన్సిస్‌కు విక్రయించేవాడు. వీటిని ఇతడు విరివిగా వినియోగిస్తుండటంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దీంతో ఇతడి స్నేహితులు, పరిచయస్తులు తమకూ డ్రగ్స్ కావాలని కోరేవారు. ఇలా డిమాండ్ పెరగడంతో అప్పటి వరకు డ్రగ్ వినియోగదారుడిగానే ఉన్న ఫ్రాన్సిస్ ఆపై పెడ్లర్‌గా మారి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ఇతడి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు లేకపోవడంతో కొత్త దందాకు శ్రీకారం చుట్టాడు. మారేడ్‌పల్లికి చెందిన విద్యార్థి గౌతమ్‌తో కలిసి ముఠా కట్టాడు. అదిలాబాద్ జిల్లాకు వెళ్లి అక్కడ ఉంటున్న సత్తార్ అనే వ్యక్తి నుంచి కేజీ రూ.4 వేల నుంచి రూ.5 వేలకు గంజాయి ఖరీదు చేసే వాడు. దీనిని బస్సుల్లో గోవాకు తరలించి కేజీ రూ.25 వేల నుంచి రూ.30 వేలకు రిటైల్‌గా చిన్న చిన్న ప్యాకెట్లలో ఉంచి అమ్ముతుండేవాడు. అలా వచ్చిన డబ్బుతో గోవాలో ఉండే అక్బర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు. అక్కడ తక్కువ ధరకు కొని నగరంలో రిటైల్‌గా ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు. హెరాయిన్ గ్రాము రూ.4 వేల నుంచి రూ.5 వేలకు కొని రూ.7 వేల నుంచి రూ.9 వేలకు, ఎల్ఎస్డీ బోల్డ్ ఒక్కోటి రూ.వెయ్యి నుంచి రూ.1500 కొని రూ.3 వేలకు, ఎక్స్టసీ ట్యాబ్లెట్స్ ఒక్కోటి రూ.1800 నుంచి రూ.2 వేలకు కొని రూ.3,500 విక్రయించేవాడు. కొన్నాళ్ళుగా గుట్టుగా సాగిస్తున్న వీరి వ్యవహారాలపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్ తమ బృందాలతో దాడి చేసి శుక్రవారం ఫ్రాన్సిస్, గౌతమ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఐదు గ్రాముల హెరాయిన్, 28 బోల్డ్‌ల ఎల్ఎస్డీ, 32 ఎక్స్టసీ ట్యాబ్లెట్స్, మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న గౌడ్, అక్బర్, సత్తార్ కోసం గాలిస్తున్నారు. ‘న్యూ’ పార్టీలపై నిఘా: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీరు ఈ డ్రగ్ తీసుకువచ్చారు. ఈ వేడుకల నేపథ్యంలో సిటీలో డ్రగ్స్ క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా ఉంచాం. ఇప్పటికే ఈవెంట్లు నిర్వహించే పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, హోటల్స్ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశాం. న్యూ ఇయర్ పార్టీల్లో డ్రగ్స్ వినియోగం, మైనర్లు మద్యం తాగడం వంటివి లేకుండా చూడాలని స్పష్టం చేశాం.– అంజనీకుమార్, కొత్వాల్ -
అడ్డంగా బుక్కై.. ఆత్మహత్య చేసుకున్నాడు!
రియోడిజెనిరో : తన కూతురులా వేషం వేసుకొని జైలు నుంచి పారిపోదామని చూసి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన బ్రెజిల్ డ్రగ్ డాన్ క్లావినో డా సిల్వా మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జైలులోని తనగదిలో బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని చనిపోయాడని జైలు అధికారులు వెల్లడించారు. శనివారం అతను జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి విఫలమమడంతో జాగ్రత్త పడిన అధికారులు అతన్ని హై సెక్యూరిటీ యూనిట్‌కు తరలించారు. 73 సంవత్సరాల కారాగారం విధించడం, ఇప్పటికే జైలు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అవడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్లావినో డా సిల్వా 2103లో జైలు నుంచి టన్నెల్ తవ్వి 27 మంది ఖైదీలతో పారిపోవడం కూడా సంచలనం అయింది. అయితే అతడు నెలరోజుల్లోనే అరెస్టు కావడంతో ప్రభుత్వం ఊపిరితీసుకుంది. (చదవండి: ‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు!) నేరముఠాలతో నిండిన బ్రెజిల్ జైళ్లు అమెరికా, చైనాల తర్వాత బ్రెజిల్ జైళ్లలోనే ఎక్కువ మంది నేరస్తులు ఉన్నారు. జైళ్లలో జరిగే ఘర్షణలో నిత్యం వందల మంది చనిపోవడం అక్కడ సర్వసాధారణం. ప్రధానంగా మాఫియా గ్యాంగ్‌ల మధ్య గొడవలకు జైళ్లు కేంద్రాలయ్యాయనే విమర్శలు ఉన్నాయి. గత వారం పారా రాష్ట్రంలోని జైలులో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో 57 మంది ఖైదీలు మృతిచెందారు. కాగా బ్రెజిల్ ఇప్పటికే కొకైన్ మార్కెట్‌కు ప్రపంచ కేంద్రంగా మారి అప్రతిష్టను మూటకట్టుకుంది. -
ఆ రాళ్లల్లో ఏముందో తెలుసా?
మాడ్రిడ్ : స్మగ్లర్లు తాము అనుకున్నది చేయటానికి కొత్తకొత్త ఐడియాలు వేస్తూ.. కొత్తకొత్త దారులు వెతుక్కుంటూ ముందుకు సాగిపోతున్నారు. స్మగ్లింగ్ వస్తువును.. అందుకలదిందు లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు కలదు! అన్న విధంగా అక్రమంగా రవాణా చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. స్పెయిన్‌కు చెందిన ఓ స్మగ్లర్ల ముఠా కొకైన్‌ను రవాణా చేయటానికి ఓ కొత్తమార్గం ఎంచుకుంది. మామూలుగా అయితే దొరికిపోతామన్న ఉద్ధేశ్యంతో రాళ్లలో(తయారుచేయబడ్డవి) కొకైన్‌ను ఉంచి స్పెయిన్‌కు తరలించారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా కొకైన్ రాళ్లతో పాటు, మామూలు రాళ్లను కూడా కలిపి రవాణా చేశారు. రాళ్లను ఓ గోడౌన్లో ఉంచి కొద్దిరోజుల తర్వాత బయటకు తీసి అమ్ముదామని అనుకున్నారు. కానీ ప్లాన్ బెడిసికొట్టింది. ఎలా కనిపెట్టారో తెలీదు కానీ! పోలీసులు కొకైన్ రాళ్లు ఉన్న గోడౌన్‌కు చేరుకున్నారు. రాళ్లను సుత్తెల సహాయంతో పగులగొట్టి కొకైన్‌ను బయటకు తీశారు. దాదాపు 1,88,000 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు తెగబడ్డ 12మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. -
కొకైన్ అక్రమ రవాణా కేసులో యువతికి పదేళ్ల జైలు
హైదరాబాద్: కొకైన్ మాదక ద్రవ్యాన్ని అక్రమ రవాణా చేసిన కేసులో ఢిల్లీకి చెందిన జ్యోతిఝూ అనే యువతికి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్‌కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.లక్ష జరిమానాను విధిస్తూ సెషన్స్‌కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు. మూడేళ్ల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ యువతి మాదక ద్రవ్యాలను రవాణా చేస్తోందన్న సమాచారం అందుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి రంగనాథన్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెట్టారు. హైదరాబాద్‌కు చేరుకోగానే జ్యోతిఝాను అదుపులోకి తీసుకుని సోదాలు చేయగా ఐదు పుస్తకాల్లో రూ.పదికోట్ల విలువ చేసే కొకైన్ బయటపడింది. హైదరాబాద్‌లో ఉంటున్న ఓ నైజీరియన్ మిత్రుడికి ఈ పుస్తకాలను అందజేయాలనుకున్నట్లు నాటి విచారణలో తెలిపింది. యువతిని అదుపులోని తీసుకుని రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగ పత్రం నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బావమరిది హత్య కేసులో... బావమరిదిని హత్య చేసిన ఓ వ్యక్తికి జీవిత ఖైదుతోపాటు రూ.వేయి జరిమానా విధిస్తూ 8వ అదనపు జిల్లా అండ్ సెషన్స్ న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. నాగోలు బ్లైండ్ కాలనీలో నివాసముండే బాబామీయా సలీమాబేగం దంపతులకు ముగ్గురు సంతానం. మద్యానికి అలవాటుపడి ప్రతిరోజూ భార్య సలీమాబేగంను హింసించేవాడు. ఆ క్రమంలో 2014 సెప్టెంబర్ 9న వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సలీమా బేగం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె సోదరుడు మహ్మద్ ఖలీం ఆ మరుసటిరోజే బాబామీయాపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. ఈ కేసు విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం ఎనిమిదవ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెలువరించారు. -
కొలంబియా నుంచి కొకైన్
సాక్షి, హైదరాబాద్: భారత్‌కు సరఫరా అవుతున్న కొకైన్ మాదకద్రవ్యం ఆఫ్రికా దేశమైన కొలంబియా నుంచి వస్తోంది. భారీ ఓడల్లో ప్రాదేశిక జలాల వరకు తీసుకువస్తున్న స్మగ్లర్లు అక్కడ నుంచి నాటు పడవల్ని ఆశ్రయిస్తున్నారు. ముంబై, గోవాల కేంద్రంగా దందా చేస్తున్న వారిలో అత్యధికులు నైజీరియన్లే ఉంటున్నారు. పోలీసు నిఘాకు చిక్కకుండా, డిపోర్టేషన్‌కు ఆస్కారం లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ జాన్ పాల్ ఒనెబూచి అలియాస్ యుగోచుకువను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నారు. భారీగా పెరిగిన సాగు కొకైన్‌ను కోకా మొక్కల నుంచి తయారు చేస్తారు. ఈ మొక్కల సాగులో కొలంబియా ప్రపంచంలోనే టాప్. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న కొకైన్‌లో 85 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. అక్కడ కోకా మొక్కల సాగు విస్తీర్ణం ఏడాదిలో లక్ష ఎకరాలకు పైగా పెరిగింది. 2016లో ఈ విస్తీర్ణం 4,64,558 ఎకరాలుగా ఉండగా.. 2017 నాటికి ఇది 5,16,450 ఎకరాలకు పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. కొలంబియా నుంచి కొకైన్‌ను ఓడల్లో ఇతర దేశాలకు తరలిస్తుంటారు. భారత్ విషయానికి వస్తే భారీ ఓడల్లో ముంబై తీరానికి 12 నాటికల్ మైళ్ల వరకు (22.2 కిమీ) తీసుకొస్తారు. అక్కడి వరకు అంతర్జాతీయ జలాలే అయినా.. ఆపై దేశ ప్రాదేశిక జలాలు మొదలవుతాయి. ఇక్కడ కోస్ట్‌గార్డ్ నిఘా ఉంటుంది. దీనికోసం అంతర్జాతీయ జలాల్లోనే ఓడల్ని ఆపేసి అనువైన ప్రాంతంలో డ్రగ్ పార్శిల్స్‌ను నాటు పడవల్లోకి ఎక్కిస్తారు. అంతర్జాతీయ, ప్రాదేశిక జలాల్లోకి మారుతూ ఎవరి కంటా పడకుండా ముంబై, గోవా తీరాలకు నాటు పడవల్ని తీసుకొస్తున్నారు. ఇలా తీరానికి చేరుకున్న మాదకద్రవ్యం హోల్‌సేల్‌గా ప్రధాన స్మగ్లర్ల చేతికి చేరుతుంది. వారి నుంచి రిటైల్‌గా విక్రయించే పెడ్లర్లు కొనుక్కొని దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిక్కితే చిరునామా మారుతుంది మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టయిన నైజీరియన్లు తమ ఉనికి బయటపడకుండా, పోలీసు నిఘా ఉండకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఒనెబూచి ఉదంతమే దీనికి తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నైజీరియాలోని లాగోస్ నుంచి 2008లో వచ్చిన ఇతడు కేరళలో స్థిరపడ్డాడు. 2015లో హైదరాబాద్‌కు మకాం మార్చి పెడ్లర్‌గా మారాడు. గోవాలో అరెస్టయ్యాక జైలు నుంచి బయటకొచ్చిన ఒనెబూచి హైదరాబాద్‌లో టోలిచౌకి నుంచి జవహర్‌నగర్‌కు మకాం మార్చాడు. 2016లో ఎల్బీనగర్ పోలీసులు మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈసారి జైలు నుంచి బయటకు రాగానే బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని సయ్యద్‌నగర్‌కు మకాం మార్చాడు. తాజాగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు అక్కడే చిక్కాడు. దాదాపు ప్రతి పెడ్లర్ కూడా ఇలా తరచూ మకాం మారుస్తుండటంతో నిఘా కష్టమవుతోందని పోలీసులు చెబుతున్నారు. అంతా ఒకచోట పెట్టకుండా.. హోల్సేలర్ల నుంచి 50 నుంచి 100 గ్రాముల చొప్పున ఖరీదు చేస్తున్న పెడ్లర్లు దాన్ని భద్రపరిచే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం ఒకే చోటనో, తమ దగ్గరో ఉంచితే పోలీసులకు చిక్కితే మొత్తం నష్టపోవాల్సి వస్తుందని నాలుగైదు భాగాలుగా చేస్తున్నారు. వాటిని వేర్వేరు ప్రాం తాల్లో, స్నేహితుల వద్ద ఉంచుతున్నారు. కొద్దికొద్దిగా తీసుకొచ్చి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీ నికి తోడు ఇంత మొత్తం డ్రగ్‌తో అరెస్టు అయితే జైలు నుంచి వచ్చాక తమ దేశాలకు బలవంతంగా తిప్పి పంపుతారనే (డిపోర్టేషన్) భయం పెడ్లర్స్‌లో ఉం టోంది. దీంతో ఒకే వ్యక్తికి 3 గ్రాములు మించి అమ్మకుండా, ఒకేసారి ముగ్గురు కంటే ఎక్కువ మంది కస్టమర్లకు అందించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. అందువల్లే ఇటీవల పోలీసులకు చిక్కిన పెడ్లర్స్ లో ఎవరి వద్దా భారీ మొత్తంలో డ్రగ్ రికవరీ కాలేదు. -
డెలివరీకి వచ్చి దొరికేశాడు
సాక్షి, సిటీబ్యూరో: గోవా నుంచి మాదక ద్రవ్యాన్ని డెలివరీ చేసేందుకు నగరానికి వచ్చిన డ్రగ్స్ పెడ్లర్‌ను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. అతడి నుంచి 5 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన ముసిహుబుద్దీన్ బర్కత్ అలీ అన్సారీ అలియాస్ సమీర్ వృత్తిరీత్యా ఎయిర్ కండిషన్ మెకానిక్‌గా పని చేసేవాడు. వృత్తిలో భాగంగా గోవాకు వెళ్లిన సమీర్ అక్కడే స్ధిరపడ్డాడు. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్ల క్రితం అతడికి గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారం చేసే స్మగ్లర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి నుంచి హోల్‌సేల్‌గా డ్రగ్స్ ఖరీదు చేసే అతను ప్రధానంగా విదేశీయులకు వాటిని విక్రయించేవాడు. కలింగూడ్ బీచ్ కేంద్రంగా ఈ దందా నిర్వహించేవాడు. కొన్నాళ్ల క్రితం విహారయాత్ర కోసం గోవా వెళ్లిన హైదరాబాదీయులతో అతడికి పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో సమీర్ డ్రగ్స్ వ్యాపారం చేస్తాడని తెలుసుకున్న నగరవాసులు అతడి ఫోన్ నంబర్ తీసుకున్నారు. ఇటీవల సమీర్‌కు కాల్ చేసిన సదరు వ్యక్తులు కొకైన్ కావాలంటూ ఆర్డర్ ఇచ్చారు. దీంతో 5 గ్రాముల కోకైన్‌తో వచ్చిన సమీర్ టోలిచౌకి పరిధిలో సంచరిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేసి సమీర్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి కొకైన్ స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటోపిక్ సబ్‌స్టాన్షియస్ (ఎన్డీపీఎస్) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ చట్ట ప్రకారం ఓ వ్యక్తి దగ్గర మాదకద్రవ్యం ఉండే మాత్రమే అతడిపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే సమీర్‌తో ఈ డ్రగ్ తెప్పించుకున్న వారిని పట్టుకోవాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. సంపన్నుల పిల్లలు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ దందా చేస్తున్న యువతిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి పెద్ద ఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఘనా దేశానికి చెందిన ఆ నిందితురాలు గత కొద్ది నెలలుగా సిటీలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లోని వ్యాపారవేత్తల పిల్లలకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ విక్రియంచినట్టు విచారణలో తేలింది. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం డ్రగ్స్ కొనుగోలు చేసిన వారందిరికీ త్వరలో నోటీసులు ఇస్తామని అధికారులు చెప్పారు. సిటీకి డ్రగ్స్ ఎలా తీసుకొస్తున్నారు.. ఇంకా ఎవరెవరున్నారు అని పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
నాడు వ్యవసాయం..నేడు అంతర్జాతీయ స్మగ్లింగ్..!
కడప అర్బన్: ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం సంపదను కొల్లగొడుతూ.. 2009 నుంచి యథేచ్ఛగా స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న కర్ణాటక రాష్ట్రం, హోస్కోట తాలూకా, కటిగెనహళ్లికి చెందిన సయ్యద్ ముజీబ్‌భాయ్ అలియాస్ మూస సామాన్య వ్యవసాయదారుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. తన స్వగ్రామంలో 2009 ముందు వరకు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. విలాసాలకు, దురలవాట్లకు బానిసగా మారిన ముజీబ్‌భాయ్ ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాడు. నిందితులు పట్టుబడిన వైనం ఎర్రచందనం అక్రమ రవాణా గురించి అందిన సమాచారం మేరకు ఈనెల 23వ తేదీన జిల్లాలోని రాజంపేట మండలం రాయచోటి–రాజంపేట ప్రధాన రహదారిలో రోళ్ల మడుగు గ్రామం క్రాస్ వద్ద జిల్లా పోలీసులు నిర్వహించిన తనిఖీలలో చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ గొంగన లీలాకుమార్‌ను అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తుండగా వెల్లడించిన వివరాలతో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగర శివార్లలో గోడౌన్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముజీబ్‌భాయ్ అలియాస్ మూసా, అతని ప్రధాన అనుచరుడు మహమ్మద్ గయాజ్ అహ్మద్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు ఐదు కోట్లు విలువజేసే 119 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోగా, వీటి బరువు మూడు టన్నుల మేరకు ఉంటుంది. వీటితోపాటు నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టు వివరాలను కడప పోలీసు పెరేడ్‌గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) లక్ష్మినారాయణ వెల్లడించారు. సిబ్బందిని అభినందించిన ఎస్పీ, ఓఎస్డీ మోస్ట్ వాంటెండ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సయ్యద్ ముజీబ్‌భాయ్ అలియాస్ మూసా, అతని అనుచరులు మహమ్మద్ గయాజ్ అహ్మద్, లీలాకుమార్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన రాజంపేట డీఎస్పీ ఆర్.రాఘవేంద్ర, రాజంపేట రూరల్ సీఐ టి.నరసింహులు, మన్నూరు ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు ప్రభాకర్, చంద్రశేఖర్, సుభాన్‌బాషా, విజయదర్శన్రావు, పుల్లంపేట కానిస్టేబుళ్లు రమేష్, లక్ష్మికర్లను ఎస్పీ అభిషేక్ మహంతి, ఏఎస్పీ (ఆపరేషన్స్) డి.లక్ష్మినారాయణలు అభినందించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ జిల్లాకు నూతనంగా పోలీసు యంత్రాంగం వచ్చిందని, స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడితే గుర్తించలేరని స్మగ్లర్లు భావిస్తే సరికాదన్నారు. పోలీసు యంత్రాంగం ఎప్పటికీ స్మగ్లర్లపై నిఘా ఉంచుతుందని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లతో ఇతనికి సంబంధం ఉంది. ఇతనిపై కడప, చిత్తూరు, తిరుపతి అర్బన్ జిల్లాలలో మొత్తం 49 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో సయ్యద్ ముజీబ్ భాయ్ అలియాస్ మూస అక్రమంగా కూడబెట్టిన స్థిర,చరాస్తుల వివరాలు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్లలో మిగిలిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు విచారణలో రాబట్టాల్సి ఉంది. ముజీబ్‌భాయ్ అలియాస్ మూసాకు ప్రధాన అనుచరుడైన మహమ్మద్ గయాజ్ అహ్మద్ బెంగళూరు సిటీ, కీల్కొట్టాల్లో నివసిస్తూ ఎనిమిది సంవత్సరాలుగా ముజీబ్‌భాయ్ ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాల్లో సహాయ సహకారాలు అందించేవాడు. ఇతనిపై తిరుపతి అర్బన్ జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా పీలేరు మండలం సూరప్పగారిపల్లెకు చెందిన గొంగన లీలాకుమార్ పదవ తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముజీబ్‌భాయ్ అనుచరుడిగా మారాడు. కూలీలను సమకూర్చుకుని జిల్లాలోని రిజర్వు అటవీ ప్రాంతాలలో ఎర్రచందనం చెట్లను నరికించి వాటిని దుంగలుగా తయారు చేయించి ముజీబ్ భాయ్ ఏర్పాటు చేసిన వాహనాలలో బెంగళూరుకు అక్రమ రవాణా చేసి అతనికి అప్పగించేవాడు. -
లేడీ కాదు ఇంటర్నేషనల్ కేడీ
న్యూఢిల్లీ : హీరో సూర్య ‘వీడొక్కడే’ సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే సీన్.. కొకైన్ క్యాప్సుల్స్‌ను కడుపులో ఉంచుకుని స్మగ్లింగ్ చేయడం. మరి దర్శకుడు కేవీ ఆనంద్ నిజ జీవితంలో జరిగిన సన్నివేశాన్ని అలా తీశారో ఏమో తెలియదు కాని. అచ్చం అలాంటి సీనే ఢిల్లీలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగు చూసింది. బ్రెజిల్ కు చెందిన ఓ మహిళ తన కడుపులో 106 క్యాప్సుల్స్‌ను స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల14న బ్రెజిల్‌కు చెందిన 25 ఏళ్ల యువతి ఢిల్లీలోని ఓ నైజీరియన్ వ్యక్తికి సరుకు అందజేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. కొకైన్ అందితే ఐదువేల డాలర్లు ఆమెకు ఇచ్చేలా బేరం కుదిరింది. ఢిల్లీలోని ఓ హోటల్లో ఉన్న ఆ నైజీరియన్‌కు దీన్ని చేరవేయడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆమెను స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానించారు. యువతిని హాస్పిటల్‌కు తరలించి ఎక్స్‌రే తీసి పరీక్షించగా అసలు విషయం బయటపడింది. ఆమె కడుపులో 930 గ్రాముల సౌత్ అమెరికన్ కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి విలువ దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసలు తెలిపారు. నేరాన్ని అంగీకరించిన ఆమె తన రెండవ భర్త కారణంగానే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిపింది. ఆదివారం ఆమెను సిటీ కోర్టు ఎదుట హాజరుపర్చిన పోలీసులు నేరం నిరూపణ కావటంతో తీహార్ జైలుకు తరలించారు. -
నగరంలో మళ్లీ డ్రగ్స్ అలజడి
హైదరాబాద్: నగరంలో మళ్లీ మాదకద్రవ్యాల అలజడి కనిపించింది. నయా వేడుకలే కాకుండా నగరంలో వారాంతాల్లో జరిగే పార్టీలకు మాదకద్రవ్యాలు సరఫరా చేసే కొన్ని ముఠాల పనిపట్టిన సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు.. తాజాగా ముంబై నుంచి నగరానికి భారీగా డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నించిన నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి మార్కెట్లో రూ.2 లక్షల విలువచేసే 31 కొకైన్, ఎండీఎంఏ హెరాయిన్ ప్యాకెట్లతో పాటు ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను బాలానగర్ ఏసీపీ గోవర్ధన్ సోమవారం మీడియాకు వివరించారు. విలాసవంత జీవితం కోసం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్ అఫ్తబ్ అలమ్ అలియాస్ షాలి అలియాస్ పప్పు (38) విలాసవంత జీవితానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో డబ్బు సంపాదనకు ముంబైలోని ముజ్రా పార్టీలకు డ్యాన్సర్లతో పాటు మాదకద్రవ్యాలను కూడా సరఫరా చేస్తుండేవాడు. ఇది తెలిసిన మటన్ షాప్ యజమాని ఇమామ్ అలీ ఖురేషీ తనతో సన్నిహితంగా ఉండే నైజీరియన్లకు అఫ్తబ్ అలమ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తుండేవాడు. అయితే అఫ్తబ్ తమ రాష్ట్రానికి చెందిన షమీమ్ అలమ్‌ను మాదకద్రవ్యాలు సరఫరా చేసే సహాయకుడిగా నియమించుకొని వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో హైదరాబాద్ నగరంపై కన్నేసిన వీరికి ప్రస్తుతం కెనడాలో ఉంటున్న హైదరాబాద్ వాసి సల్మాన్ ద్వారా అమీర్‌పేటలోని రచముత్సవ్ సంస్థ ఈవెంట్ మేనేజర్ రఫత్ మెహిదీ అలీఖాన్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ముంబైకి దాదాపు మూడుసార్లు వెళ్లి అలీఖాన్ మాదకద్రవ్యాలు తీసుకొచ్చాడు. అయితే అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకురావడం ఇబ్బందవుతోందని చెప్పడంతో ఆ ముగ్గురూ ఆదివారం నగరంలోని కూకట్పల్లి వద్దనున్న భరత్‌నగర్ ప్రైడ్ ఆఫ్ హోటల్‌కు వచ్చారు. అప్పటికే అక్కడికి చేరిన అలీఖాన్ వారి నుంచి డ్రగ్స్ తీసుకుంటుండగా సనత్‌నగర్ పోలీసుల సహాయంతో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ నలుగురి నుంచి ఒక్కో గ్రాము బరువు గల 31 కొకైన్, ఎండీఎంఏ, హెరాయిన్ ప్యాకెట్లతో పాటు ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్యాకెట్ మాదక ద్రవ్యాన్ని రూ.2,500 నుంచి రూ.5వేల వరకు కొనుగోలు చేసి నగరంలో రూ.10 వేల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే అలీఖాన్ తమ సంస్థ తరపున నిర్వహించిన వివిధ ఈవెంట్లలో కస్టమర్లతో పరిచయాలు పెంచుకొని మాదకద్రవ్యాలు విక్రయించినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. విలేకరుల సమావేశంలో మాదాపూర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ పురుషోత్తం, సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, సెల్ఫోన్లు -
ఆకాశ మార్గంలో కొకైన్ స్మగ్లింగ్
బెంగళూరు: మాదకద్రవ్యాల అక్రమరవాణా కోసం పాతాళంలో భారీ సొరంగాలు తొవ్వడం మెక్సికన్ స్మగ్లర్ల స్టైల్. అంతకు తక్కువేమీ కాదంటూ బాహాటంగా ఆకాశమార్గంలో ఇండియాకు కొకైన్ తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నార్కోటిక్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఎమిరెట్స్ విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ. 20 కోట్ల విలువైన 3.34 కేజీల కొకైన్ ను ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టెక్ నగరం బెంగళూరులో జరిగే నైట్ పార్టీల కోసమే ఈ కొకైన్ సరఫరా అవుతున్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. నిందితుడ్ని జ్యుడిషిల్ కస్టడీకి తరలించామని, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశామని తెలిపారు. ఎయిర్ పోర్టులో ఇంత భారీ స్థాయిలో కొకైన్ పట్టుబడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.