
మమతతో గంగూలీ భేటీ.. దాదాకు కీలక పదవి!
కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్ష పదవికి గంగూలీ పేరు వినిపిస్తున్న తరుణంలో ఆయన మమతా బెనర్జీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
బీసీసీఐ అధ్యక్షుడు, క్యాచ్ చీఫ్ జగ్మోహన్ దాల్మియా మరణంతో ఈ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా ఉన్న గంగూలీని చీఫ్గా నియమిస్తే బాగుంటుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలావుండగా, బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు అరూప్ బిస్వాల్, సుబ్రతా ముఖర్జీ కూడా అధ్యక్ష పదవిపై కన్నేశారు. ఈ నేపథ్యంలో గంగూలీ మమతా బెనర్జీతో సమావేశమయ్యారు.