మహిళా జర్నలిస్టుతో క్యాబ్ డ్రైవర్ పిచ్చి వేషాలు.. ఫోటో తీసి.. | Woman Journalist Molested South Kolkata Cab Driver Arrested | Sakshi
Sakshi News home page

మహిళా జర్నలిస్టుతో క్యాబ్ డ్రైవర్ పిచ్చి వేషాలు.. ఫోటో తీసి..

Published Sat, Nov 13 2021 3:43 PM | Last Updated on Sat, Nov 13 2021 9:35 PM

Woman Journalist Molested South Kolkata Cab Driver Arrested - Sakshi

కోల్‌కతా: రోడ్ల పై ఒంటరి మహిళలు కనపడితే కొందరు ఆకతాయిలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వారిని వేధిస్తుంటారు. ఈ తరహాలోనే ఓ మహిళా జర్నలిస్టును క్యాబ్ డ్రైవర్ వేధించడమే గాక తన స్నేహితురాలిపై దాడి చేసి చివరికి జైలు పాలయ్యాడు. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలోని బెహలాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ టీవీ న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న మహిళ, సాల్ట్ లేక్ సెక్టార్ 5లోని తన కార్యాలయం నుంచి స్కూటర్‌పై స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా సత్యన్ రాయ్ రోడ్-జేమ్స్ లాంగ్ రోడ్ క్రాసింగ్ వద్ద ఈ సంఘటన జరిగిందీ.

క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ గురువారం రాత్రి మహిళను రోడ్డుపైకి నెట్టడానికి తన స్కూటర్‌ను పలుమార్లు ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. చివరకు అతని ఆగడాలను భరించలేక ఆమె సత్యేన్ రాయ్ రోడ్-జేమ్స్ లాంగ్ రోడ్ క్రాసింగ్ వద్ద తన స్కూటర్‌ను ఆపి అతన్ని వారించింది. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్ మహిళపై దాడి చేసి వేధించడమే గాక ఆమె స్నేహితురాలితో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ అతని వాహనాన్ని ఫోటో తీసుకుని బెహలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

చదవండి: పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది.. కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement