శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో ఔటర్‌రింగురోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి క్యాబ్ ఢీకొట్టింది.
శంషాబాద్ రూరల్(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో ఔటర్‌రింగురోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి క్యాబ్ ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. క్యాబు లారీ కిందకు చొచ్చుకెళ్లటంతో డ్రైవర్ మృతదేహాన్ని తీయడం కష్టమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.