ముంబై: పోలీస్ అవ్వాలన్న కోరిక ఉంటే ఆ శాఖ నిర్వహించే పరీక్షలు రాసి సెలక్ట్ అవ్వాలి. కానీ.. ఇక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ మాత్రం పెద్దగా కష్టపడకుండానే తనకు తానే పోలీస్ అని ప్రకటించుకున్నాడు, కానిస్టేబుల్ అని అందరితో చెప్పుకున్నాడు. ట్యాక్సీకి పోలీస్ స్టిక్కర్ అతికించాడు. అంతటితో ఆగకుండా ఖాకీ దుస్తులు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకే ముంది ఫేమస్ అయిపోదామనుకున్న అతగాడు పోలీసులు అరెస్టు చేయడంతో కటకటాలపాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. విజయ్ గుండ్రె ముంబైలోని ఘన్సోలీలో నివసించేవాడు. క్యాబ్ నడుపుతూ జీవనం సాగించేవాడు. అయితే చుట్టుపక్కల వారితో పోలీస్ అని చెప్పుకునేవాడు. ఈ క్రమంలో ఒక రోజు పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. విజయ్ గుండ్రె పట్టుబడ్డాడు. పోలీసులకు టోకరా ఇచ్చి తప్పించుకుందాం అనుకున్నాడు. తాను కూడా డిపార్ట్‌మెంట్ అని కవర్ చేశాడు. కానీ అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయడంతో అతడు నకిలీ పోలీసన్న విషయం బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు.
చదవండి: వాహన దారులకు షాక్: శాశ్వతంగా లైసెన్సు రద్దు
Comments
Please login to add a commentAdd a comment