న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఈ చట్టం గురించి కొత్త కొత్త పుకార్లు కూడా బాగానే షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ చెత్త పుకారు బాగా వ్యాప్తి చేందుతుంది. అదేంటంటే.. బైక్ మీద వెళ్లే వారికి హెల్మెట్, కారులో వెళ్లేవారు సీటు బెల్టు ధరించడం తప్పనిసరి ఎలానో.. అలానే క్యాబ్ డ్రైవర్లు కార్లలో కండోమ్‌లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.. లేదంటే చలానా విధిస్తారంటూ ఓ తప్పుడు వార్త ప్రచారం అవుతోంది. కండోమ్ లేని కారణంగా ధర్మేంద్ర అనే క్యాబ్ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారట. ఇందుకు సంబంధించిన రిసిప్ట్‌ను అతడు షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వార్త బాగా వ్యాప్తి చెందుతుంది.
దీని గురించి ధర్మేంద్ర మాట్లాడుతూ.. ‘ట్రాఫిక్ సిబ్బంది నా క్యాబ్‌ని చెక్ చేసినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో కండోమ్ లేదు అని చెప్పి చలానా విధించారు. నాలా ఇంకొకరికి జరగకూడదనే ఉద్దేశంతో.. చలానా కట్టిన రిసిప్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాను’ అని తెలిపాడు. అంతేకాక ఢిల్లీ సర్వోదయ డ్రైవర్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఇక మీదట క్యాబ్ డ్రైవర్లందరు కార్లలో కండోమ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఆదేశించాడు. ఈ విషయం గురించి పలువురు క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుతూ.. ‘ఫిటనెస్ టెస్ట్‌లో భాగంగా చాలాసార్లు ట్రాఫిక్ అధికారులు క్యాబ్‌లో కండోమ్ ఉందా అని ప్రశ్నించేవారు. దాంతో ఒకటి తీసుకుని అలా పడేశాను’ అన్నారు. మరి కొందరు ‘ఎప్పుడైనా యాక్సిడెంట్ లాంటి ప్రమాదాలు జరిగితే కట్టుకట్టడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో క్యాబ్‌లో కండోమ్ ఒకటి ఎప్పుడు ఉంచుతాను’ అన్నారు.
అయితే దీని గురించి ట్రాఫిక్ అధికారులను ప్రశ్నించగా కొత్త మోటారు వాహన చట్టంలో ఇలాంటి రూల్ ఎక్కడా లేదని.. ఫిట్‌నెస్ టెస్ట్‌లో కూడా కండోమ్ గురించి ఎప్పుడు ప్రశ్నించలేదని తెలిపారు. క్యాబ్‌లో కండోమ్ లేదని ఎవరికైనా జరిమానా విధిస్తే.. వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment