హైదరాబాద్ లో నేటి రాత్రి ఉచిత క్యాబ్ లు | Telangana Four Wheeler Drivers Association providing free cabs | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో నేటి రాత్రి ఉచిత క్యాబ్ లు

Published Sun, Dec 31 2017 2:47 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

Telangana Four Wheeler Drivers Association providing free cabs - Sakshi

హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకల్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ఫోర్‌ వీలర్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ నడుంబిగించింది. కొత్త ఏడాది వేడుకలు ముగిసిన అనంతరం చోటుచేసుకునే ప్రమాదాలను నివారించేందుకు ‘హమ్‌ ఆప్‌కా సాత్‌ హై’ అంటూ ఓ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు ఉచితంగా క్యాబ్‌ సర్వీసులను అందించనున్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ సేవలను అందించనున్నట్లు తెలంగాణ ఫోర్‌ వీలర్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల అనంతరం మద్యం మత్తులో మునిగి తేలుతున్నవారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మొత్తం 300 క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఉచిత సేవల కోసం 91776 24678, 88970 62663 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎవరైనా ఫోన్‌ చేస్తే వారి దగ్గరికే క్యాబ్‌లను పంపిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement