drivers association
-
బాబు హేళన.. డ్రైవర్ల ఆగ్రహం
చిత్తూరు రూరల్/బైరెడ్డిపల్లి/నగరి/తిరుపతి సిటీ: చంద్రబాబునాయుడుకు పేదలంటే గిట్టదు. దళితులన్నా, బడుగు, బలహీన వర్గాలన్నా ఆయనకు పడదు. అందుకే బహిరంగ సభలు, అసెంబ్లీ సమావేశాల్లో వారిని హేళనగా మాట్లాడేస్తుంటారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ‘ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా..?’ అంటూ దళితులను తీవ్రంగా అవమానపరిచారు. ఆపై నాయీబ్రాహ్మణులను తన దరికి చేరకుండానే కించపరిచి వెలుపులకు పంపేయడం గతంలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఎడమచేత్తో వేలిముద్రలేసేవారు టిప్పర్ డ్రైవర్లంటూ శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యరి్థని ఉద్దేశించి చులకనగా మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై జిల్లాలోని డ్రైవర్లు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. దళితులు వేలిముద్రగాళ్లని, డ్రైవర్లని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని మండిపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బాబుకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని ప్రతినబూనుతున్నారు. వెంటనే డ్రైవర్లందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళన తప్పని హెచ్చరిస్తున్నారు. బాబులో ఓటమి భయం కనిపిస్తోంది డ్రైవర్లనే కాదు, గతంలో ఎస్సీలను, నాయీ బ్రాహ్మణులను సైతం ఇదే రీతిలో అసభ్య పదజాలంతో అవమానించాడు. సీఎం జగన్ పేదల పక్షపాతి. కష్టం విలువ తెలిసిన నాయకుడు. అందుకే టిప్పర్ డ్రైవర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇది సాహసమనే చెప్పాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలు జగనన్న పక్షాన నిలిచి మరో మారు సీఎంగా గెలిపించుకుంటారు. బాబును ప్రజలు పట్టించుకోవడం లేదు. అందుకనే ఆయన ఇలాంటి నీచపు మాటలకు తెరతీస్తున్నారు. – పి.కరుణాకర్, క్యాబ్ డ్రైవర్, తిరుపతి పేదల వ్యతిరేకి చంద్రబాబు చంద్రబాబు నాయుడు పేదల వ్యతిరేకి. ఎన్నిక ల్లో సామాజిక న్యాయం పాటిస్తూ నిరుపేద అయిన టిప్పర్ డ్రైవర్‌కు ఎమ్మెల్యే సీటు కేటాయించిన పేదల పక్షపాతి వైఎస్.జగన్మోహన్రెడ్డి. నిరుపేద టిప్పర్ డ్రైవర్‌కు రాజకీయ అవకాశం కల్పించడాన్ని జీర్ణించుకోలేని బాబు బహిరంగ సభలో హేళనగా మాట్లాడడం దారుణం. తన 14 ఏళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాల వారిపై దాడులు చేసి అగౌరవ పరిచారు. – కె.కేశవులురెడ్డి, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర వైట్ బోర్డ్ కార్ డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, తిరుపతి డ్రైవర్లంతా రోడ్డెక్కుతాం రాష్ట్రంలోని డ్రైవర్లంతా రోడెక్కితే తినే తిండికి కూడా తిప్పలే. ఎక్కడికక్కడికి బండ్లు ఆపేసి చంద్రబాబుపై యుద్ధం ప్రకటిస్తాం. అప్పుడు తెలుస్తుంది డ్రైవర్ల సత్తా ఏమిటో. డ్రైవర్లను హేళన చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కచ్చితంగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. మాలాంటి డ్రైవర్లకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం గిట్టక, అతనితో ఒడిపోతే.. పరువు పోతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉంది. –త్యాగరాజులు, టిప్పర్డ్రైవర్, గుడిపాల మా సత్తా ఏంటో చూపిస్తాం చంద్రబాబు డ్రైవర్లను హేళన చేసి మాట్లాడితే ఊరుకోం. టీడీపీ హయంలో చంద్రబాబు ఓ సభలో ఎస్సీగా ఎవరైనా పుడతారా..?అని ఎస్సీలను చులకన చేశారు. అందుకే 2019 ఎన్నికలో ఎస్సీలంతా కలిసి తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు డ్రైవర్లంటూ హేళన చేశారు. ఈసారి ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం. –చిట్టిబాబు, ఆటోడ్రైవర్, చిత్తూరు డ్రైవర్ విలువ తెలుసా బాబు? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్రైవర్ లేకుండా ఎక్కడికై నా వెళ్లగలడా.. డ్రైవర్ విలువ తెలిసి కూడా డ్రై వర్లను హేళన చేస్తూ మాట్లాడడం సమంజసం కాదు. పేదలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే తప్పేంటి. డ్రైవర్లను చులకన చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. –శ్రీనివాస్, డ్రైవర్, బైరెడ్డిపల్లె -
వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీ) డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చిన్నచిన్న తప్పిదాలతో వీఐపీలు ప్రాణాలు కోల్పోతున్నారని.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఘటన నేపథ్యంలో రవాణా శాఖ సుమోటోగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీఐపీలంతా తమ డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ లేఖలు రాస్తామన్నారు. ఈ జాబితాలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారని వివరించారు. వారి డ్రైవర్లకు అన్ని జిల్లాల్లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పరీక్షల అనంతరం డ్రైవర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, వారిని కొనసాగించుకోవాలా వద్దా అనేది వీఐపీల ఇష్టమని చెప్పారు. పొన్నంప్రభాకర్ శనివారం గాం«దీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో రోజూ సగటున 45లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని, ఇప్పుడా సంఖ్య 55–60 లక్షల వరకు ఉంటోందని తెలిపారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఆర్టీసీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడుస్తోందని చెప్పారు. పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని, గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని.. పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ స్థలాల్లో ప్రాజెక్టులు చేపడతామని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద అనవసరంగా జీరో టికెట్లు కొట్టే కండక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీకి మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ప్రతిమా శ్రీనివాసరావు లాంటి వారు పాత బకాయిలు చెల్లిస్తున్నారన్నారు. ఆర్టీసీలోకి కొత్తగా వెయ్యి బస్సులు తీసుకువస్తామన్నారు. ఇప్పటికే 100 వచ్చాయని, దశలుగా మిగతావి తెస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్గో ఆదాయం రూ.150 కోట్లకు చేరిందని, రూ.2 వేల కోట్ల ఆదాయార్జన ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీలది డ్రామా బీఆర్ఎస్– బీజేపీ ఒకటేనని.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త డ్రామా మొదలుపెట్టాయని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ ఒకటి కాదని చెప్పుకొనేందుకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తున్నారని.. అందుకే వాయిదాల పద్ధతుల్లో నోటీసులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిహార్ మోడల్లో కులగణన త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని, ఇందుకోసం బిహార్‌లో అమలు చేసిన ప్రక్రియను అనుసరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ గణన కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతి ఎన్యూమరేటర్‌కు శిక్షణ ఇస్తామని, కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అంశంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామన్నారు. కులగణన బిల్లును దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆమోదించలేదని, అలాంటిది ఏదైనా ఉంటే బీఆర్ఎస్ నేతలు చూపాలని సవాల్ చేశారు. ఆటో కార్మి కులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చామని.. దీనిపై కేబినెట్లోనూ చర్చించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోల రంగం ఇబ్బంది పడుతుందనడంలో వాస్తవం లేదని.. అందుకు ప్రతి నెలా అమ్ముడవుతున్న ప్యాసింజర్ ఆటోల గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. -
ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్‌లపై ఎగబడుతున్న జనం
ఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలతో ఇంధన ట్రక్కులు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందని జనం పెట్రోల్ బంక్‌లపై ఎగబడుతున్నారు. థానే జిల్లాలోని మీరా భయాందర్ ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ హైవేపై ట్రక్కు డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడితో పోలీసు వాహనం ధ్వంసమైంది. షోలాపూర్, కొల్హాపూర్, నాగ్‌పూర్, గోండియా జిల్లాల్లో కూడా రోడ్లు దిగ్బంధించారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ నిరసనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,000 మందికి పైగా ప్రైవేట్ బస్సు డ్రైవర్లు సమ్మెను ప్రకటించారు. రాయ్‌పూర్, బిలాస్పూర్, దుర్గ్, రాజ్‌నంద్‌గావ్‌లోని బస్ స్టేషన్లలో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. ఆందోళనలు రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలిగిస్తాయని భయపడి ప్రజలు వివిధ నగరాల్లోని పెట్రోల్ పంపుల వద్ద క్యూ కట్టారు. అటు.. పశ్చిమబెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లోనూ డ్రైవర్ల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. -
త్వరలో ఉబర్ డైవర్లకు పెన్షన్
లండన్: ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ యూకేలోని పనిచేస్తున్న అర్హులైన ఉబర్ డ్రైవరలందరి కోసం నెలరోజుల వ్యవధిలోనే పెన్షన్ పథకం ప్రారంభించనున్నట్లు పేర్కొంది. గత నెలలో ఉబర్ డ్రైవర్లను కార్మికులుగా పరిగణించాల్సిందేనని స్పష్టంచేస్తూ ఒక కేసులో లండన్‌లోని కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉబర్ కింద పనిచేస్తున్న డ్రైవర్లకు బ్రిటన్‌లో కనీస వేతనం, సెలవు, అనారోగ్యానికి సంబంధించి హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డ్రైవర్లు తాము ఆర్జిస్తున్న సంపాదనలో కనీసం 5% ఆదా చేసుకున్నట్లయితే 3% పెన్షన్ ప్లాన్‌కి దోహదపడుతుందని ఉబర్ పేర్కొంది. అయితే బ్రిటన్ జీఎంబీ యూనియన్ యూకేలోని డ్రైవర్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతేకాదు వారికి వర్కఫోర్స్ తరుఫున చర్చించే హక్కు కూడా కల్పించింది. ఇతర ట్యాక్సీ రైడ్ దిగ్గజాలైన ఓలా, బోల్ట్, అడిసన్ లీలను తమ కంపెనీల్లో పనిచేసే డ్రైవర్లకు కూడా ఇలాటి ప్రయోజనాలను అందించాలని ఉబర్, జీఎంబీ సంస్థలు కోరాయి. ఈ సందర్భంగా ఉబర్ ఎగ్జిక్యూటివ్ జామీ హేవుడ్ మాట్లాడుతూ..."సరికొత్త ఒరవడిని సృష్టించే ఈ పరిశ్రమల పెన్షన్ పథకంలో ఇతర ట్యాక్సీ రైడ్ దిగ్గజాలైన ఓలా, బోల్ట్, అడిసన్ లీలతో కలిసి చేయడానికి స్వాగతిస్తున్నాను" అని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభంకానున్న ఈ పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్లందరికీ ఈ పథకం వర్తిస్తుంది. -
కోవిడ్ సెకండ్ వేవ్.. కుదేలవుతున్న క్యాబ్‌లు!
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదికి పైగా ప్రజారోగ్యంపై పడగ నీడలా మారిన మహమ్మారి కోవిడ్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. గతేడాది విజృంభించిన వైరస్ బారినుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వ్యవస్థలు తిరిగి కుదేలవుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్ రెండో దశ ఉద్ధృతి అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. గత సంవత్సరం కోవిడ్ కారణంగా కుదేలైన ప్రజారవాణా వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్న తరుణంలో ముంచుకొచ్చిన రెండో దశ మరోసారి పిడుగుపాటుగా మారింది, ప్రత్యేకించి క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, ఆటోలు తదితర వాహనాలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 80 వేలకుపైగా క్యాబ్‌లు ఉబెర్, ఓలా తదితర క్యాబ్దిగ్గజ సంస్థలకు అనుసంధానమై తిరుగుతుండగా, గత నెల రోజులుగా 50 వేలకు పడిపోయినట్లు అంచనా. ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, రాత్రింబవళ్లు పడిగాపులు కాసినా కనీస ఆదాయం లభించకపోవడంతో చాలా మంది డ్రైవర్లు, వాహన యజమానులు క్యాబ్‌లను వదిలేస్తున్నారు. గత 10 రోజులుగా క్యాబ్‌ల వినియోగం గణనీయంగా తగ్గినట్లు తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌కు ముందు వేలాది మందికి ఉపాధినిచ్చిన క్యాబ్‌లు ఇప్పుడు భారంగా మారినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు తగ్గిన బుకింగ్‌లు.. ►పెళ్లిళ్లు, వేడుకలు, సామూహిక ఉత్సవాలు వంటి వివిధ కార్యక్రమాల కోసం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ట్రావెల్స్ వాహనాల బుకింగ్‌లు కూడా తగ్గుముఖం పట్టాయి. 8 సీట్లు, 10 సీట్లతో నడిచే మ్యాక్సీ క్యాబ్‌లు, 14 నుంచి 22 సీట్ల వరకు ఉండే మినీ బస్సులకు డిమాండ్ తగ్గినట్లు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. ►మే నెల వరకూ పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతో వాహనాలకు డిమాండ్ కనిపించడం లేదు. ముఖ్యంగా పర్యాటక రంగం చాలా వరకు దెబ్బతిన్నది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే సందర్శకుల తగ్గిపోయింది. కోవిడ్‌కు ముందు ప్రతిరోజూ సుమారు 50 వేలమందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు నగర సందర్శన కోసం వచ్చేవారు. ఏడాదికిపైగా అంంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుండగా కోవిడ్ రెండో దశ ఉప్పెనలా వచ్చిపడింది. దీంతో బుకింగ్‌లపై ప్రభావం పడినట్లు ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెరుచుకోని ఐటీ రంగం.. ►గతేడాది ఐటీ సంస్థలు లాక్డౌన్ విధించాయి. సాఫ్ట్వేర్ నిపుణులు చాలా వరకు ఇంటి నుంచే పని చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి, ఐటీ ప్రాంతాలకు రోజుకు 10,వేలకుపైగా క్యాబ్‌లు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్యాబ్‌లు చాలా వరకు సాధారణ రాకపోకలపై మాత్రమే ఆధారపడి తిరుగుతున్నాయి. కానీ ప్రస్తుత రెండో దశ దృష్ట్యా అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే నగర వాసులు క్యాబ్‌లు వినియోగిస్తున్నారు. ► ఇదే సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. కోవిడ్ దృష్ట్యా గతేడాది నుంచి ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడ్డారు. గత నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి రెండో వారం వరకు ప్రజారవాణా వాహనాలకు డిమాండ్ కనిపించింది. కానీ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. -
ఉబర్‌కు ఎదురుదెబ్బ
లండన్: బ్రిటన్ సుప్రీంకోర్టులో ఉబర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్లను కార్మికులుగా పరిగణించాల్సిందేనని స్పష్టంచేస్తూ ఒక కేసులో లండన్ లోని కోర్టు తీర్పునిచ్చింది. దీనితో ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ కింద పనిచేస్తున్న డ్రైవర్లకు బ్రిటన్‌లో కనీస వేతనం, సెలవు, అనారోగ్యానికి సంబంధించి సిక్ పే హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఉబర్ తన డ్రైవర్లను ‘స్వయం ఉపాధి’ పొందుతున్న స్వతంత్ర థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లుగా వీరిని సంస్థ వర్గీకరించింది. అంటే చట్టం ప్రకారం వారికి కనీస రక్షణలు మాత్రమే లభిస్తాయి. దీనిపై డ్రైవర్ల పోరాటంతో దీర్ఘంకాలంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వారిని స్వయం ఉపాధి కార్మికులుగానే గుర్తించాలన్న ఉబర్ విజ్ఞప్తిని న్యాయమూర్తి జార్జ్ లెగ్గట్ తోసిపుచ్చారు. బ్రిటన్ చట్టాల ప్రకారం కనీస ఉపాధి హక్కులు లభించే కార్మికులుగా తమను గుర్తించాలని దాదాపు 25 మంది డ్రైవర్లు ఒక గ్రూప్‌గా 2016కు ముందు ప్రారంభించిన న్యాయపోరాట ఫలితమిది. డ్రైవింగ్‌కు సంబంధించి యాప్ లాగ్ ఆన్ అయిన సమయం నుంచి లాగ్ ఆఫ్ అయిన సమయం వరకూ తన డ్రైవర్లను ఉబర్ ‘‘కార్మికులుగానే’’ పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పటికే ఈ మేరకు ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్, ఎంప్లాయిమెంట్ అప్పీల్ ట్రిబ్యునల్, అప్పీలేట్ కోర్ట్ ఉబర్ డ్రైవర్లకు అనుకూలంగా తీర్పునిచ్చాయి. తాజా రూలింగ్‌పై ఉబర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తామని పేర్కొన్నారు. 2016కు ముందు యాప్‌ను వినియోగించిన డ్రైవర్లందరి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడతామని తెలిపారు. కోర్టు ప్రకటన తరువాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో ఉబెర్ షేర్లు 3.4 శాతం పడిపోయాయి. -
దోపిడీకి గురవుతున్నారు..
సాక్షి, హైదరాబాద్ : రాజేష్ సొంత వాహనం గల ఓ క్యాబ్ డ్రైవర్. హైటెక్ సిటీలోని ప్రముఖ ఐటీ సంస్థకు రవాణా సేవలు అందించాలని భావించాడు. సంస్థ అధికారులను నేరుగా సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ సంస్థకు సుమారు 200 వాహనాలను అందజేస్తున్న వెండర్స్ వ్యవస్థ ఉంది. ఒక బడా వెండర్ కింద మరో ఇద్దరు సబ్ వెండర్లు ఉన్నారు. చివరకు ఆ సబ్ వెండర్ సహాయంతో డ్యూటీలో చేరాడు. కానీ అతనికి ప్రతినెలా వచ్చే ఆదాయంలో ముగ్గురు వెండర్లకు కమిషన్ చెల్లించగా మిగిలింది కేవలం రూ.25 వేలు, ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోలేక, కారు లోన్ కిస్తీ చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ‘ఓలా, ఊబర్ వంటి సంస్థల్లోనే పెద్ద ఎత్తున కమిషన్ తీసుకొని మోసం చేస్తున్నారని ఐటీ సంస్థల్లో చేరితే.. వెండర్స్ వ్యవస్థ మరింత దోచుకుంటోందని రాజేష్ ఆందోళన వ్యక్తం చేశాడు. హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, వేవ్‌రాక్ వంటి ఐటీ కారిడార్లలో పెద్ద పెద్ద ఐటీ సంస్థలకు రవాణా సదుపాయాన్ని అందజేసే వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు వెండర్స్ వ్యవస్థ కారణంగా తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. క్యాబ్ డ్రైవర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీని పెంచి వారికి దక్కాల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. ఓలా,ఉబర్ వంటి సంస్థల్లాగే ఐటీ సంస్థలకు రవాణా సదుపాయాన్ని అందజేసే నెపంతో వెండర్స్ వ్యవస్థీకృతమైన దోపిడీకి పాల్పడుతున్నారు. ‘బతుకు దెరువు కోసం రూ.లక్షల్లో అప్పు చేసి స్విఫ్ట్ డిజైర్ వంటి సెడాన్ వెహికల్స్ కొనుగోలు చేసిన డ్రైవర్లు వెండర్లకు కమిషన్ చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏ రవాణా చట్టాల్లోనూ లేని ఈ ‘వెండర్స్’ వ్యవస్థ.. డ్రైవర్లను నిలువునా దోచుకుంటుంది’ అని ఆం దోళన వ్యక్తం చేశాడు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్. ‘ఓలా, ఉబర్‌లో అన్యాయం జరుగుతుందని ఐటీ కంపెనీలకు వస్తే ఇక్కడా అదే పరిస్థితి ఉంది’ అని విస్మయం వ్యక్తం చేశాడాయన. బడా ట్రావెల్స్‌దే గుత్తాధిపత్యం గ్రేటర్‌లోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు సుమారు 30 వేల మందికి పైగా క్యాబ్ డ్రైవర్లు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నారు. రాత్రింబవళ్లు క్యాబ్ డ్రైవర్ల సేవలు కొనసాగుతున్నాయి. కానీ ఈ డ్రైవర్లలో ఏ ఒక్కరు నేరుగా ఆయా కార్పొరేట్ సంస్థలకు అనుసంధానం కాలేదు. కార్పొరేట్ సంస్థలు తమకు చెల్లించే వేతనాలను కూడా స్వయంగా పొందేందుకు అవకాశం లేదు. వేలాది మంది క్యాబ్ డ్రైవర్లకు, వందల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలకు మధ్య కొన్ని బడా ట్రావెల్స్ సంస్థలు మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ బడా ట్రావెల్స్ కింద మరో రెండు స్థాయిల్లో సబ్ వెండర్స్ పాతుకుపోయారు. మొత్తంగా ఒక కార్పొరేట్ సంస్థకు మూడు స్థాయిల్లో ‘వెండర్స్’ వ్యవస్థ వాహనాలను సమకూరుస్తుండగా, అంతిమంగా తమ సొంత వాహనాలతో రవాణా సదుపాయాన్ని అందజేసే క్యాబ్ డ్రైవర్లు మాత్రం కమిషన్ చెల్లింపులతో తీవ్రంగా నష్టపోతున్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి వెండర్ కిలోమీటర్‌కు రూ.14 చొప్పున వసూలు చేస్తూ.. డ్రైవర్లకు మాత్రం రూ.9 చెల్లిస్తున్నారు. ‘కార్పొరేట్ సంస్థలు ఒక షీట్ (ట్రిప్పునకు) రూ.750 వరకు చెల్లిస్తారు. కానీ మా చేతికి అందేది రూ.450 మాత్రమే. పైగా డీజిల్‌పై 8 శాతం చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం’ అని క్యాబ్ డ్రైవర్ అశోక్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాగా పెరిగిన పోటీ ఐటీ కారిడార్లలో ఒకప్పుడు క్యాబ్‌లు మాత్రమే రవాణా సదుపాయాన్ని అందజేసేవి. ఇప్పుడు సిటీ బస్సులతో పాటు, మెట్రో అందుబాటులోకి రావడంతో పోటీ పెరిగింది. దీంతో వెండర్స్‌ను డిమాండ్ చేయలేని పరిస్థితి. ఒక్కో కార్పొరేట్ సంస్థకు ఒకప్పుడు వెయ్యికి పైగా వాహనాల అవసరం ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 60 శాతానికి తగ్గింది. దీంతో క్యాబ్ డ్రైవర్ల మధ్య కూడా పోటీ పెరిగింది. ‘మంత్లీ ప్యాకేజీపై నడిచే పెద్ద వాహనాలు ఉన్నాయి. ఇలాంటి వాహనాలకు కార్పొరేట్ సంస్థలు ప్రతినెలా రూ.45 వేల వరకు చెల్లిస్తే వెండర్లు ఇచ్చేది మాత్రం రూ.35 వేలే. ఈ వ్యవస్థలోంచి బయటకు రాలేక, తగిన ఉపాధి పొందలేక కొట్టుమిట్టాడుతున్నాం’ అని ఆవేదన చెందాడు రాజశేఖర్. వెండర్ వ్యవస్థను రద్దు చేయాలి ఏ మోటారు వాహన చట్టంలోనూ లేని ఈ వెండర్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. అసంఘటిత రంగంలోని క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేసేందుకు రవాణాశాఖ చర్యలు తీసుకోవాలి. – షేక్ సలావుద్దీన్, తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు గతంలో ఈ దోపిడీ లేదు మొదట్లో వెండర్ వ్యవస్థ లేదు. కార్పొరేట్ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా వాహనాలను సమకూర్చుకొనేవి. కానీ కొన్ని ట్రావెల్స్ సంస్థల గుత్తాధిపత్యంతో ఇది మొదలైంది. – అశోక్‌గౌడ్, క్యాబ్ డ్రైవర్ తీవ్రంగా నష్టపోతున్నాం అప్పు చేసి బండి కొంటే నెలనెలా ఈఎంఐ చెల్లించలేకపోతున్నాం. ఒక అప్పు తీర్చేందుకు మరోచోట అప్పు చేయాల్సి వస్తుంది. వెండర్స్ వ్యవస్థ లేకుండా చేస్తేనే డ్రైవర్లకు మేలు జరుగుతుంది. – రాజశేఖర్, క్యాబ్ డ్రైవర్ -
అసభ్యంగా దూషించిందని..
బంజారాహిల్స్: అకారణంగా యజమానురాలు డ్రైవర్‌ను అసభ్యపదజాలంతో దూషించిందని ఆరోపిస్తూ ఆల్ సిటీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..చింతల్‌కు చెందిన విజయ్‌భాస్కర్ గత కొంత కాలంగా జూబ్లీహిల్స్ రోడ్ నం. 10(సి) గాయత్రిహిల్స్‌లో ఉంటున్న విజయనిర్మల అనే మహిళ ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జ్వరం రావడంతో అతను గత రెండు రోజులుగా డ్యూటీకి రావడం లేదు. దీంతో ఆదివారం అతడికి ఫోన్ చేసిన యజమానురాలు విజయనిర్మల అసభ్యంగా దూషించింది. దీనిని తన సెల్ఫోన్లో రికార్డు చేసిన బాధితుడు యూనియన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో యూనియన్‌కు చెందిన వంద మంది డ్రైవర్లు ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి డ్రైవర్‌ను కించపరిచేలా మాట్లాడిన విజయనిర్మలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు ఏసు, షకిల్ తదితరులు పాల్గొన్నారు. -
నాసిరకం డ్రైవర్లు రాకుండా చూడాలి
సాక్షి, హైదరాబాద్: తక్కువ వేతనం ఇస్తుండటం వల్లే అద్దె బస్సులకు నాసిరకం డ్రైవర్లు వస్తున్నందున ఈ సమస్య పరిష్కారానికి వెంటనే దృష్టి సారించనున్నట్టు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. వారికి మెరుగైన వేతనాలు చెల్లిస్తే నైపుణ్యం ఉన్నవారు డ్రైవింగ్‌కు వచ్చే వీలున్నందున, అద్దె బస్సు యజమానులతో చేసుకునే ఒప్పందంలో మెరుగైన వేతనాలు చెల్లించేలా నిబంధన చేర్చాలని, వేతనాలు పెంచేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొన్నిరోజులుగా అద్దెబస్సులు ప్రమాదాలకు గురవుతున్న తీరు, దానికి కారణాలను విశ్లేషిస్తూ ‘ఆటోడ్రైవర్ల చేతిలో ఆర్టీసీ బిస్స’శీర్షికతో శనివారం ‘సాక్షి’ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. శనివారం సాయంత్రం సచివాలయంలో ఆయన రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు పురుషోత్తం నాయక్, వినోద్, టీవీరావు, అజయ్‌కుమార్, సీటీఎం రాజేంద్రప్రసాద్, సీఎంఈ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ కృష్ణకాంత్, ఇతర అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అద్దె బస్సులకు నైపుణ్యంలేని డ్రైవర్లు వస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవం, నైపు ణ్యం లేకపోవటమే కాకుండా డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్లో మాట్లాడటం, పాన్, గుట్కా వేసుకోవటం లాంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూండటం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి అన్నారు. దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్యంగా బస్సులు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపైనే కాకుండా, వారిని పనిలో పెట్టిన అద్దె బస్సుల యజమానులపై కూడా చర్యలు తీసుకుంటేనే ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఏం చర్యలు తీసుకుంటున్నారు..? ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను మంత్రి వేముల ప్రశ్నించారు. సంస్థ సొంత డ్రైవర్లయితే ప్రాథమిక విచారణ జరిపి బాధ్యులని తేలితే సస్పెండ్ చేస్తున్నామని, తుది విచారణలోనూ నిర్ధారణ అయితే తొలగిస్తున్నామని అధికారులు వివరించారు. అద్దె బస్సు డ్రైవర్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నామని పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసే వారికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని అధికారులు వివరించారు. ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురికాకుండా చూడాలని అధికారులకు సూచించారు. అద్దె బస్సు డ్రైవర్లకు కొన్ని మార్కులను వెయిటేజీగా ఇస్తే ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతో వారు బాధ్యతాయుతంగా ఉంటారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వీటిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి తెలపాలని మంత్రి సూచించారు. బస్సుల జీవితకాలం వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. 13.50 లక్షల కిలోమీటర్లు తిరిగినా లేదా 15 ఏళ్లపాటు తిరిగిన వాటిని తుక్కు కింద తొలగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత వరకు బస్సులు కండీషన్లో ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. -
ప్రమాదంలో జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: రాత్రి 11 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ నుంచి ఎల్బీనగర్ వెళ్లడానికి ఓ ప్రయాణికుడు క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కాడు. వీరి వాహనం నాంపల్లి దాటిన తర్వాత డ్రైవర్ నిద్రలోకి జారుతుండటం గుర్తించిన ప్రయాణికులు నిలదీశాడు. ‘ఉదయం నుంచి అన్నీ లాంగ్ బుకింగ్సే సార్.. రెస్ట్ లేదు’ అంటూ సమాధానమిచ్చాడు డ్రైవర్. జూబ్లీహిల్స్ నుంచి కొండాపూర్ వెళ్లడానికి మరో వ్యక్తి యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేశాడు. బుకింగ్ కన్ఫర్మ్ అయిన సమయంలో ఓ డ్రైవర్ పేరు, ఫొటో కనిపించాయి. తీరా క్యాబ్ వచ్చిన తర్వాత చూస్తే డ్రైవింగ్ సీట్లో వేరే వ్యక్తి ఉన్నాడు. అదేమంటూ ప్రయాణికుడు ప్రశ్నిస్తే... ‘క్యాబ్ మా సార్‌ది. నేనూ డ్రైవింగ్ చేస్తుంటా’ అని అన్నాడు. నగరంలోని అనేక మంది క్యాబ్ వినియోగదారులకు ఈ అనుభవాలు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. వీటిని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో పాటు ఎవరికి ఫిర్యాదు చేయాలే తెలియక కొందరు, మనకెందుకులే అనే భావనతో మరికొందరు వదిలేస్తున్నారు. ఈ తరహా ఉల్లంఘనలు, నిర్లక్ష్యాలు కొన్ని సందర్భాల్లో భద్రతపై నీలినీడలు వ్యాపింపజేసే ప్రమాదం ఉందన్నది నిర్వివాదాంశం. జరగరానిది ఏదైనా జరిగితే తప్ప ఈ అంశాలపై ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు దృష్టి పెట్టే పరిస్థితులు కనిపించట్లేదు. భద్రమనే ఉద్దేశంతోనే వాటి వైపు... రాజధానిలో క్యాబ్‌ల సంఖ్య లక్ష వరకు ఉంటుంది. ఆటోలు వీటికంటే చాలా ఎక్కువగానే ఉంటాయి. క్యాబ్ ఎక్కాలంటే కచ్చితంగా యాప్ ద్వారానో, ఫోన్ వినియోగించో బుక్ చేసుకోవడంతో పాటు అది వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. అయినప్పటికీ ప్రస్తుతం నగరవాసులు పెద్ద సంఖ్యలోనే క్యాబ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉండటం, ఎక్స్ట్రా డిమాండ్స్ లేకపోవడంతో పాటు భద్రమనే ఉద్దేశమే దీనికి కారణం. అయితే అత్యంత కీలకమైన ఈ భద్రత కోణాన్నే క్యాబ్ నిర్వహణ సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పరోక్షంగా టార్గెట్లు ఇస్తూ సమయపాలన పట్టించుకోకపోవడంతో పాటు క్యాబ్‌లను ఎవరు డ్రైవ్ చేస్తున్నారనే అంశమూ నిర్వాహకులకు పట్టట్లేదు. ఇదే భవిష్యత్తులో విపరీత పరిణామాలకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పని వేళల అమలు ఆమడ దూరం... కిరాయికి సంచరించే క్యాబ్‌లు సైతం కమర్షియల్ వాహనాల కిందికే వస్తాయి. మోటారు వాహన చట్టం (ఎంవీ యాక్ట్) ప్రకారం ఈ వాహనాల డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు కావాల్సిందే. వీటి డ్రైవర్లు రోజుకు గరిష్టంగా పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ విధులు నిర్వర్తించే కనీస కాలం ఎనిమిది గంటల్లో కచ్చితంగా రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి. అయితే క్యాబ్ నిర్వాహక సంస్థలు పక్కాగా ఇన్ని ట్రిప్పులు వేయాలంటూ డ్రైవర్లకు పరోక్షంగా టార్గెట్లు విధిస్తున్నాయి. దీన్ని పూర్తి చేసిన వారికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దీంతో ఒక్కో క్యాబ్ డ్రైవర్ కనిష్టంగా 15 గంటల నుంచి గరిష్టంగా 18 గంటల వరకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. అలసట తీరేందుకు ఆగుదామన్నా... ఇలా నిత్యం ఉరుకులు–పరుగులు పెట్టే డ్రైవర్లు అప్పుడప్పుడు కాస్త అలసట తీర్చుకుందామని భావించినా ఇబ్బందే వస్తోంది. ఇలాంటి డ్రైవర్లు తామ వాహనాలను పార్కింగ్ చేసుకుని సేదతీరేందుకు అవసరమైన స్థలాలు అన్ని చోట్లా అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా ఎక్కువ శాతం రోడ్ల పక్కనే ఆపుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులో ఇతర వాహనచోదకులో వచ్చినప్పుడల్లా తమ వాహనాలను పక్కకు తీయాల్సి ఉండటంతో సరైన విశ్రాంతి లభించట్లేదు. ఇలా ఆపడం అనేక సందర్భాల్లో ఎదుటి వారికి, కొన్నిసార్లు వారికే ప్రమాదహేతువుగా మారుతోంది. ఈ సమస్య తీరాలంటే క్యాబ్స్ డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు చేయడంపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. పేరొకరిది... వచ్చేది ఇంకొకరు... క్యాబ్ నిర్వహణ సంస్థలు భద్రత ప్రమాణాల్లో భాగంగా తమ డ్రైవర్ల రిజిస్ట్రేషన్‌ను పక్కా చేశాయి. ఇలా చేసుకున్న వారి వివరాలన్నీ ఆ సంస్థ వద్ద ఉంటాయి. యాప్స్‌ను వినియోగించి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి తాను ఎక్కబోతున్న వాహనం డ్రైవర్ పేరు, ఫొటో, నెంబర్‌తో పాటు అతడి రేటింగ్ సైతం అందులో కనిపిస్తుంది. ఏ సమయంలో ఎక్కడకు ప్రయాణం చేసినా భద్రంగా గమ్యం చేర్చడానికి ఈ ఏర్పాటు ఉంది. అయితే ఇటీవల కాలంలో నగరంలో క్యాబ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకరు ఉండే... డ్రైవింగ్ చేస్తూ వస్తున్న వారు మరొకరు ఉంటున్నారు. ఇలా ‘మార్పిడి’ చేసుకుంటున్న వారిలో కుటుంబీకులే ఉంటే పర్వాలేదు కాని కొన్ని సందర్భాల్లో బయటి వారూ ఉంటున్నారు. వేరే వ్యాపకాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉన్న వారు, గతంలో అనివార్య కారణాలతో క్యాబ్ నిర్వాహకులు ‘బ్లాక్’ చేసిన డ్రైవర్లు ఈ మార్గం అనుసరిస్తున్నారు. దీన్ని కనిపెట్టడానికి అనువైన క్రాస్ చెకింగ్ మెకానిజం క్యాబ్ నిర్వాహకుల వద్ద ఉండట్లేదు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, అటు ఆర్టీఏ అధికారులు... వీరిలో ఎవరికీ ఈ విషయాలు పట్టట్లేదు. -
హైదరాబాద్ లో నేటి రాత్రి ఉచిత క్యాబ్ లు
హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకల్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్ల అసోసియేషన్ నడుంబిగించింది. కొత్త ఏడాది వేడుకలు ముగిసిన అనంతరం చోటుచేసుకునే ప్రమాదాలను నివారించేందుకు ‘హమ్ ఆప్కా సాత్ హై’ అంటూ ఓ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు ఉచితంగా క్యాబ్ సర్వీసులను అందించనున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సేవలను అందించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల అనంతరం మద్యం మత్తులో మునిగి తేలుతున్నవారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మొత్తం 300 క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఉచిత సేవల కోసం 91776 24678, 88970 62663 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎవరైనా ఫోన్ చేస్తే వారి దగ్గరికే క్యాబ్‌లను పంపిస్తామన్నారు. -
పోటాపోటీగా నామినేషన్లు
– మూడేళ్ల తర్వాత ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘానికి ఎన్నికలు – అధ్యక్ష పదవి కోసం ఏడుగురు నామినేషన్లు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడి ఎన్నిక కోసం శనివారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర సంఘం కార్యదర్శి డీఎస్ కొండయ్య ఎన్నికల అధికారి హోదాలో సి.క్యాంపు సెంటరులోని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం పంక్షన్ హాల్లో నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్ష పదవికి ఏడుగురు నామినేషన్లు వేయడం విశేషం. మాజీ అధ్యక్షుడు అబ్దుల్‌హమీద్, మాజీ ఉపాధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, ఇతర నాయకులు గోవిందు, ఇలియాస్‌బాషా, ఎన్ మౌలాలి, పి. విజయకుమార్, ఎ. శ్రీను.. తమ నామినేషన్లను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదేరోజున ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఉపసంహరణ సమయం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఈ నెల 16న పోలింగ్ జరుగనుంది. సంఘంలో ఓటర్లుగా 208 మంది ఉన్నారు. పోటీలో ఉండే అభ్యర్ధులు సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. అబ్దుల్‌హమీద్, నాగేశ్వరరావు మినహా మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
నేటి అర్ధరాత్రి నుంచి క్యాబ్స్ సమ్మె
బషీర్‌బాగ్, న్యూస్‌లైన్: ఐటీ ఉద్యోగుల రవాణా కోసం పనిచేస్తున్న క్యాబ్స్ రేట్లు పెంచాలని, సబ్ వెండర్స్ వ్యవస్థను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్టు తెలంగాణ క్యాబ్స్ యజమానులు-డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.సంతోషర్‌రెడ్డి, గ్రేటర్ విభాగం అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. డీజిల్ రేట్లు, వాహనాల నిర్వహణ వ్యయం పెరిగినందున క్యాబ్స్ రవాణ రేట్లు పెంచాలన్నారు. ప్రమాదాలు జరిగితే అయా కంపెనీలే బాధ్యత వ హించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు సబ్బీర్ అహ్మద్, టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు టి.సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.