లండన్: ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ యూకేలోని పనిచేస్తున్న అర్హులైన ఉబర్ డ్రైవరలందరి కోసం నెలరోజుల వ్యవధిలోనే పెన్షన్ పథకం ప్రారంభించనున్నట్లు పేర్కొంది. గత నెలలో ఉబర్ డ్రైవర్లను కార్మికులుగా పరిగణించాల్సిందేనని స్పష్టంచేస్తూ ఒక కేసులో లండన్‌లోని కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉబర్ కింద పనిచేస్తున్న డ్రైవర్లకు బ్రిటన్‌లో కనీస వేతనం, సెలవు, అనారోగ్యానికి సంబంధించి హక్కులు కల్పించాల్సి ఉంటుంది.
ఈ క‍్రమంలో డ్రైవర్లు తాము ఆర్జిస్తున్న సంపాదనలో కనీసం 5% ఆదా చేసుకున్నట్లయితే 3% పెన్షన్ ప్లాన్‌కి దోహదపడుతుందని ఉబర్ పేర్కొంది. అయితే బ్రిటన్ జీఎంబీ యూనియన్ యూకేలోని డ్రైవర్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతేకాదు వారికి వర్కఫోర్స్ తరుఫున చర్చించే హక్కు కూడా కల్పించింది. ఇతర ట్యాక్సీ రైడ్ దిగ్గజాలైన ఓలా, బోల్ట్, అడిసన్ లీలను తమ కంపెనీల్లో పనిచేసే డ్రైవర్లకు కూడా ఇలాటి ప్రయోజనాలను అందించాలని ఉబర్, జీఎంబీ సంస్థలు కోరాయి.
ఈ సందర్భంగా ఉబర్ ఎగ్జిక్యూటివ్ జామీ హేవుడ్ మాట్లాడుతూ..."సరికొత్త ఒరవడిని సృష్టించే ఈ పరిశ్రమల పెన్షన్ పథకంలో ఇతర ట్యాక్సీ రైడ్ దిగ్గజాలైన ఓలా, బోల్ట్, అడిసన్ లీలతో కలిసి చేయడానికి స్వాగతిస్తున్నాను" అని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభంకానున్న ఈ పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్లందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment