నేటి అర్ధరాత్రి నుంచి క్యాబ్స్ సమ్మె | The cabs on strike from midnight | Sakshi
Sakshi News home page

నేటి అర్ధరాత్రి నుంచి క్యాబ్స్ సమ్మె

Published Tue, May 20 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

నేటి అర్ధరాత్రి నుంచి క్యాబ్స్ సమ్మె

నేటి అర్ధరాత్రి నుంచి క్యాబ్స్ సమ్మె

బషీర్‌బాగ్, న్యూస్‌లైన్: ఐటీ ఉద్యోగుల రవాణా కోసం పనిచేస్తున్న క్యాబ్స్ రేట్లు పెంచాలని, సబ్ వెండర్స్ వ్యవస్థను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్టు తెలంగాణ క్యాబ్స్ యజమానులు-డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.సంతోషర్‌రెడ్డి, గ్రేటర్ విభాగం అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు.

సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. డీజిల్ రేట్లు, వాహనాల నిర్వహణ వ్యయం పెరిగినందున క్యాబ్స్ రవాణ  రేట్లు పెంచాలన్నారు. ప్రమాదాలు జరిగితే అయా కంపెనీలే బాధ్యత వ హించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు సబ్బీర్ అహ్మద్, టీఆర్‌ఎస్‌కేవీ అధ్యక్షుడు టి.సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement