ప్రేమించలేదని నగ్న చిత్రాలు పంపాడు
హైదరాబాద్ (సాక్షి, సిటీబ్యూరో): ప్రేమను తిరస్కరించింద న్న అక్కసుతో యువతి సెల్‌ఫోన్‌కు పదే పదే కాల్స్ చేయడంతో పాటు మెయిల్‌కు అసభ్యకర పదజాలంతో పాటు నగ్నచిత్రాలు పంపి వేధించిన కీచకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ జయరాం కథనం ప్రకారం...వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రాజ్‌కుమార్ బీటెక్ చదువు కోసం హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో చేరాడు. ఇదే కళాశాలలో బీటెక్ చదువుతున్న యువతితో స్నేహంగా మెదిలాడు.
బీటెక్ ఫైనల్ ఈయర్‌కు రాగానే రాజ్‌కుమార్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పడంతో సున్నితంగా తిరస్కరించింది. అయితే కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన నిందితుడు హైదరాబాద్‌లోనే ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. ఇదే సమయంలో తమ క్లాస్‌మేట్‌ల సహకారంతో బాధితురాలి సెల్‌ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ తెలుసుకున్న రాజ్‌కుమార్ ఆమెను వేధించాలని నిర్ణయించుకున్నాడు. తన నంబర్ల నుంచి చాలాసార్లు కాల్స్ చేయడంతో పాటు ప్రేమిస్తున్నాన ని ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపాడు. అయితే బాధితురాలు తిరస్కరిం చింది. ఆ తర్వాత నకిలీ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి అసభ్యకర పదజాలంతో పాటు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన నగ్నచిత్రాలు పంపించి వేధించాడు. దీంతో బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదిహేనురోజుల పాటు మళ్లీ ఎటువంటి మెయిల్స్ పంపని రాజ్‌కుమార్... ఆ తర్వాత మళ్లీ వేధించడం షురూ చేశాడు. దీంతో ఆమె మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించగా రాజ్‌కుమార్ ను గచ్చిబౌలిలోని టెలికాంనగర్‌లో పట్టుకున్నారు. నిందితుడి నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.