హుబ్లీ: డిజిటల్ డబ్బు బిట్‌కాయిన్లపై పెట్టుబడి పెట్టి రూ.లక్షలాది లాభం పొందవచ్చని నమ్మించి హుబ్లీలో మోసగాళ్లు కోట్ల రూపాయలు వసూలు చేసిన వైనం రట్టయింది. వివరాలు.. హుబ్లీ చొరవిఅక్కళ నివాసి వాసప్ప లోకప్ప అనే వ్యక్తికి ఢిల్లీకి చెందిన అమిత్ భరద్వాజ్, అజయ్ భరద్వాజ్ తదితరులు పరిచయం పెంచుకున్నారు. స్థానిక చేతన్ పాటిల్ అనే ఏజెంట్‌ను పెట్టుకుని హుబ్లీ– ధార్వాడ నగరాల్లో ప్రముఖ వ్యాపారులను ఒక హోటల్‌కు రప్పించుకొని బిట్‌కాయిన్లపై పెట్టుబడి పెడితే దండిగా లాభాలు పొందవచ్చని బ్రెయిన్‌వాష్ చేశారు.
వ్యాపారి వాసప్ప లోకప్ప రూ.45 లక్షలు ఇచ్చి కొన్ని బిట్‌కాయిన్ల కొనుగోలు చేశారు. ఆ కాయిన్లను అమ్ముదామని ఖాతాలో చూసుకుంటే ఒక్కటి కూడా లేవు. దీంతో మోసపోయినట్లు గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా హుబ్లీ–ధార్వాడల్లో అనేకమంది నుంచి ఢిల్లీ ముఠా రూ.10 కోట్ల మేర స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తన వంటి బాధితులు 40 నుంచి 50 దాకా ఉన్నారని వాసప్ప తెలిపారు. కమ్మరిపేట పోలీసుల్లు ఏజెంట్ చేతన్ పాటిల్, ఢిల్లీ ముఠా కోసం వేట మొదలు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment