ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి(కర్ణాటక): సిలికాన్‌సిటీలో సైబర్ కేటుగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయక ప్రజలను వంచించి లక్షలు దోచేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో మహిళను పరిచయం చేసుకున్న సైబర్ కేటుగాళ్లు మ్యారేజ్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి రూ.3.71 లక్షలు వంచనకు పాల్పడ్డారు.
ఫేస్‌బుక్‌లో పరిచయం..
బాధితురాలు అమరావతికి ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని యువకుడు పరిచయమయ్యాడు. అతనికి ఆమె తన వాట్సాప్ నెంబర్ ఇచ్చింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఇదే క్రమంలో సైబర్ మోసగాడు నీకు విలువైన మ్యారేజ్ కానుక ఇస్తానని నమ్మించాడు.
చదవండి: ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఎవిడెన్స్..
కొద్దిరోజుల తరువాత అమరావతికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుతో విలువైన కానుకలు వచ్చాయని, వాటిని పొందడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పాడు. దీంతో దశల వారీగా ఆమె రూ. 3.71 లక్షలు వారు చెప్పిన ఖాతాలకు జమ చేశారు. ఇక ఎన్ని రోజులైన గిఫ్ట్ రాకపోవడంతో పరిచయమైన వ్యక్తి ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయినట్లు భావించి సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment