
డ్రగ్స్ ఇచ్చి.. అశ్లీల సీడీలతో బెదిరింపు!!
బాగా డబ్బున్న ఆసాములను చూసుకోవడం, వాళ్లను డ్రగ్స్తో మత్తులో ముంచి అశ్లీల సీడీలు రూపొందించి వాటితో బెదిరించడం.. ఇదే పనిగా పెట్టుకున్న ఓ మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉదయ్పూర్లోని వర్మ కాలనీ ప్రాంతానికి చెందిన రుబినా హరూన్ ఖాన్ (28) అనే మహిళ ఆటోమొబైల్ ఏజెన్సీలో పనిచేసేది.
అక్కడకు వచ్చే కస్టమర్లలో బాగా డబ్బున్నవాళ్లను గుర్తించి, వాళ్లను తన అందంతో ఆకర్షించేదని, గోవర్ధన్ విలాస్ ప్రాంతంలోని తన అపార్టుమెంటుకు రప్పించేదని పోలీసులు తెలిపారు. అక్కడకు వెళ్లిన తర్వాత వాళ్లకు బీరులో డ్రగ్స్ కలిపి ఇచ్చేదని, తర్వాత వాళ్లతో అశ్లీల వీడియోలు రూపొందించి, వాటిని సీడీలుగా మార్చి వాటితో బెదిరించేదని చెప్పారు. ఎట్టకేలకు రఫీక్ మహ్మద్ అనే వ్యక్తి ఆమె ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు.