ఐపీఎల్లో ఆడిస్తానంటూ మోసం చేసిన 43 ఏళ్ల మహిళను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. తిరువనంతపురానికి చెందిన నజారత్ షహాబుద్దీన్ అనే ఈమెపై కొందరు అబ్బాయిల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అలువా పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. తిరువనంతపురంలోని ఎస్హెచ్ఏ క్లబ్బుకు నజారత్, ఆమె సోదరుడు అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల మొదట్లో ఐపీఎల్ సెలక్షన్ ట్రయల్స్ కూడా నిర్వహించి, ఏకంగా 13 మంది అబ్బాయిలను ఎంపిక కూడా చేసేశారు.
తర్వాత ఈ నెలాఖరులో జైపూర్ తీసుకెళ్లి మ్యాచ్లు ఆడిస్తామని, అందులో వారి ఆటతీరును బట్టి వాళ్లు భారత టి20 జట్టుకు ఎంపికవుతారని ఆమె చెప్పినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వాళ్ల ఆహారం, ప్రయాణాలు, జెర్సీ, బ్యాట్ల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 25 వేల వంతున ఆమె వసూలు చేసింది. దీంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వారు పోలీసుకేసులు పెట్టారు. జైపూర్లోని జాతీయ టి20 క్రికెట్ ఫెడరేషన్కు తాను రాష్ట్ర సమన్వయకర్తనంటూ ఆమె పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చింది.
ఐపీఎల్లో ఆడిస్తానని మోసం.. మహిళ అరెస్టు
Published Mon, Jun 16 2014 2:38 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM
Advertisement