కీసర(రంగారెడ్డి): అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమె వద్ద నుంచి 40 మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం కరీంగూడలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ అక్రమంగా మద్యం విక్రయిస్తోందన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తనఖీలు చేశారు. మహిళను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 40 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకెవరైనా ఇందులో భాగస్వామ్యం పంచుకున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.