రూ.5 కోట్ల రద్దయిన కరెన్సీ స్వాధీనం
గురుగ్రామ్: టెక్నాలజీ హబ్‌గా పేరు గాంచిన గురుగ్రామ్‌లో భారీ కరెన్సీ మార్పిడి ముఠా ఆట్ట కట్టించారు పోలీసులు. ముఠా వద్ద నుంచి రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల కరెన్సీ దాదాపు రూ.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. న్యూఢిల్లీకి సౌత్-ఈస్ట్‌లో ఉన్న గురుగ్రామ్‌లో పాత నోట్ల మార్పిడి జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది.
ఇక్కడి సెక్షన్ 15లోని ఓ ఇంట్లో ఓ ముఠా పాత నోట్లు మార్పిడి చేయడానికి భారీగా కమిషన్లు తీసుకుంటుందని పోలీసులు గుర్తించారు. గురువారం ఓ పోలీసు బృందం అకస్మాత్తుగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించి రద్దయిన కరెన్సీ రూ.5 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు గురుగ్రామ్ పోలీసులు వివరించారు.