శామీర్‌పేట్: రైతు వేదికలను ప్రారంభించేందుకు గాను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో పర్యటించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు రామ మందిరం నిర్మాణంపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ మజీద్‌పూర్ వద్ద మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌ని ఆపి నిరసన తెలిపేందుకు రాజీవ్‌రహదారిపై బైఠాయించారు. దీనిపై సమాచారం అందడంతో మంత్రి కాన్వాయ్ అలియాబాద్ చౌరస్తా వరకు రాజీవ్ రహదారిలో రాంగ్ రూట్‌లో అక్కడి నుంచి వెళ్లి పోయారు. రాంగ్ రూట్ లో వెళ్లిన మంత్రి వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తారా లేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment