![MLA CH Malla Reddy Says If Party Orders Will Contest From Malkajgiri Lok sabha - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/4/Mallareddy.jpg.webp?itok=gwiFnhRu)
సాక్షి, మేడ్చల్: బీఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మల్లారెడ్డి.గురువారం తెలంగాణ భవన్‌లో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో మల్కాజిగిరి ఎంపీ గా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటివల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇదే తరహలో ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఆదరిస్తారన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలను బీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని దీమాను వ్యక్తం చేశారు.
లోక్‌సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. తాను పోటీ చేసే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశం ఈ నెల 21 తెలంగాణ భవన్‌లో పార్లమెంట్‌పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో అదిష్టానం నిర్వహిస్తుందని మల్లారెడ్డి తెలిపారు.
చదవండి: CM Revanth: అమిత్‌షాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
Comments
Please login to add a commentAdd a comment