Malkajgiri lok sabha constituency
-
Telangana: జాలీగా..సరదాగా..
రికార్డు స్థాయిలో తన ఆగ్రహాన్ని చూపించాడు సూరీడు.. అయినా ఓటర్ల అనుగ్రహం కోసం అనుక్షణం తపించారు నేతలు.. స్వేదంతో తడిసి ముద్దవుతున్నా పట్టు సడలకుండా ప్రచారం చేశారు. సోమవారం లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజకీయ పారీ్టల అభ్యర్థులు నచ్చిన వ్యాపకాలతో సేదదీరుతున్నారు. ఫలితాలకు ఇంకా చాలా రోజుల సమయం ఉండడంతో ఆహ్లాదంగా గడపడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు ఆయా పారీ్టలకు చెందిన ఎమ్మెల్యేలూ ప్రచారంలో పాల్గొని.. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతున్నారు. మనవరాలితో సరదాగా పద్మారావు గౌడ్ సతీమణి అనిత, మనవరాళ్లతో దానం నాగేందర్ మనవడు ఆహాన్‌తో గడ్డం శ్రీనివాస్ యాదవ్ అలసిసొలసిన మనసుకు చిన్నారి చిరునవ్వులను మించిన సాంత్వన ఏముంది? అందుకేనేమో.. హైదరాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తన మనవడు ఆహాన్‌తో ఆటల్లో మునిగిపోయారు. తాను సైతం చిన్న పిల్లాడిలా మనవడితో ఆటపాటల్లో మునిగిపోతూ సోమవారం అంతా సేదదీరారు. సికింద్రాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ సైతం మంగళవారం మొత్తంగా ఇంటికే పరిమితమయ్యారు. రోజుల తరబడి అలుపెరగని ఎన్నికల ప్రచారాన్ని సాగించిన ఆయన మరో మూడు రోజుల్లో ఉత్తరాది పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మనవడు రుద్రాంశ్‌తో రాగిడి లక్ష్మారెడ్డి.. ఈ విరామంలో కుటుంబ సభ్యులతో మనవలు, మనవరాళ్లతో గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా క్షణం తీరిక లేకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లోనే ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మంగళవారం సందడిగా గడిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో.. మనవడు భవనం రుద్రాంశ్, కుమారుడు రాగిడి వెంకటసాయి రియాన్ రెడ్డిలతో కలిసి ఆటలాడుతూ వారితో కలిసి స్విమ్ చేస్తూ రీచార్జ్ అయ్యారు. ప్రచారంలో బిజీగా మారిన సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ముగిసిన తర్వాత మంగళవారం కుటుంబంతో కాస్త రిలాక్స్‌గా కనిపించారు. ఉదయం తన మనవరాళ్లతో ఇంట్లో సరదాగా గడిపారు. పచ్చని పరిసరాల్లో... ఎన్నికల ప్రచారంలో భాగంగా వేసవి ఎండలను లెక్కచేయకుండా క్షణం తీరిక లేకుండా పనిచేశాం. పోలింగ్ పూర్తయి ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో కొంత మానసిక ప్రశాంతత అవసరం అని కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. మొక్కల మధ్య పచ్చని పరిసరాల్లో గడుపుతూ పెట్స్‌తో రిలాక్స్ అవుతున్నా.– సునీతా మహేందర్‌రెడ్డి, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిఆరోగ్యంపై దృష్టి.. తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలవాలి. మనం ఓటరుకు ఏం చెప్పాలనుకుంటున్నామో వారికి చేరవేయాలనే తపనతో నియోజకరవ్గం మొత్తం కలియతిరిగాను. ఇక ఇప్పుడు ఈ ఒత్తిడి నుంచి దూరం కావడానికి మానసిక ప్రశాంతత కోసం 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా.అలాగే ఈ టైమ్‌లో ఆరోగ్యంపై దృష్టిపెట్టి తగిన మార్పు చేర్పులు చేసుకుంటున్నా. – రంజిత్‌రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి మనవడు ఆర్యవీర్‌తో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ‘సాక్షి’ పత్రిక చదువుతున్న ఎమ్మెల్యే కాలేరు -
Hyderabad: వీరు తమ ఓటు తాము వేసుకోలేరు
హైదరాబాద్: గ్రేటర్‌పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పారీ్టల అభ్యర్థుల్లో కొందరు తమ ఓటును తమకు వేసుకోలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్ ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీ¯న్ ఒవైసీ రాజేంద్రనగర్ పరిధిలోని శా్రస్తిపురంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్‌లో ఉంది. ఈ ప్రాంతం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ నివాసం జూబ్లీహిల్స్‌లో ఉంది. అది సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. అది మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డికి తాండూరులో ఓటుంది. ఆ ప్రాంతం చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. వీరందరూ తమ ఓటును తాము వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఉంది. -
ఈటలకు మల్కాజ్గిరి ఫిక్స్!.. బీజేపీ నేతలతో కీలక భేటీ?
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మల్కాజ్గిరి ఎంపీ టికెట్‌ను ఈటల రాజేందర్‌కు కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో, ఆయన పోటీ ఆసక్తికరంగా మారనుంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలో ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మల్కాజ్గిరి స్థానం ఈటలకు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. దీంతో, ఈటల శామీర్‌పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ మేరకు మెసేజ్‌లు వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభకు పోటీ చేస్తా: మల్లారెడ్డి
సాక్షి, మేడ్చల్: బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మల్లారెడ్డి.గురువారం తెలంగాణ భవన్లో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో మల్కాజిగిరి ఎంపీ గా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటివల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇదే తరహలో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తారన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని దీమాను వ్యక్తం చేశారు. లోక్‌సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. తాను పోటీ చేసే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశం ఈ నెల 21 తెలంగాణ భవన్లో పార్లమెంట్పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో అదిష్టానం నిర్వహిస్తుందని మల్లారెడ్డి తెలిపారు. చదవండి: CM Revanth: అమిత్‌షాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ -
ఆ స్థానాన్ని ఇప్పటికీ గెలవలేని బీఆర్ఎస్, బీజేపీలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్లకు అందని ద్రాక్షగా ఉన్న మల్కాజ్గిరి ఎంపీ స్థానం వచ్చే ఎన్నికల్లో ఎలగైనా సాధించాలనే పట్టుదలతో రెండు పార్టీలు బలమైన నేతలను రంగంలోకి దించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఈ రెండు పార్టీలు ఈ సీటును గెలవలేదు. మూడు సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ మల్కాజ్గిరి ఎంపీ సీటును గెలిచాయి. పునర్వీభజనలో ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడో సారి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. నాల్గో సారి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ పార్లమెంటు స్థానంలో గెలిచారు. మల్కాజిగిరి ఎంపీ స్థానానికి మురళీధర్‌రావు.. అధికంగా ఉత్తర భారతీయ ఓటర్లు, అధిక శాతం హైదరాబాద్ నగర ఓటర్లు ఉన్న మల్కాజిగిరి పార్లమెంటు సీటును ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నో రాష్ట్రాలకు ఇన్చార్జిగా పని చేసి బీజేపీని గెలిపించిన పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్‌రావును మల్కాజ్గిరి నుంచి బరిలో దింపుతున్నట్లు సమాచారం. మల్కాజ్గిరి పార్లమెంట్‌కు ఎలాంటి సంబంధం లేని మురళీధర్‌రావు తరుచూ నియోజకవర్గ పరిధిలోని వివిధ సెగ్మెంట్లలో తన పేరుపై కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టుకోసం యత్నాలు చేస్తున్నారు. గత డిసెంబర్లో డబీల్‌పూర్ ఇస్కాన్ మందిరంలో మురళీధర్‌రావు నేతృత్వంలో గవర్నర్ తమిళిసైని రప్పించి హోమా లు నిర్వహించి అందరినీ అక్క డకు పిలిచారు. రెండు నెలల క్రితం కుత్బుల్లాపూర్ ఉత్తర భారతీయు లతో కార్యక్రమం నిర్వహించారు. తాజాగా డబీల్‌పూర్‌లో గోదావరి హార తి కార్యక్రమాలను చేపట్టా రు. ఇలా ఏ దో ఒక కార్య క్రమం చేస్తూ ఈ జాతీయ నేత హల్చల్ చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. మేడ్చల్ నుంచి కేఎల్ఆర్.. మేడ్చల్‌లో బీజేపీకి కాస్తో..కూస్తో.. పట్టున్నప్పటికీ బలమైన నాయకుడు ఆ పార్టీలో కనబడటం లేదు. అర్ధ బలం, ప్రజా బలం ఉన్న నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ బలమైన అభ్యర్థి వేటలో ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నిక కావడంతో నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ను పార్టీలోకి చేర్చుకుని మేడ్చల్ నుంచి పోటీకి దింపాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. కేఎల్ఆర్తో పలు దఫాలు చర్చలు చేశారని ఆయన రెండు, మూడు నెలల్లో పార్టీలో చేరతారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. రాజన్న ఉంటారో... గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి ఈ సారి ఆ పార్టీ టికెట్టు ఇస్తుందో..లేదో.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయన ఓడినప్పటికీ ఆయనకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పదవిని ఆ పార్టీ అధిష్టానం ఇచ్చినా.. ఆయన పూర్తిగా నియోజకవర్గంలోని అన్ని సెగ్మెంట్లలో కనిపించలేదు. కేవలం మేడ్చల్‌కు పరిమితమయ్యారు. తరుచూ మంత్రి కేటీఆర్, సీఎం కేపీఆర్‌లతో టచ్‌లో ఉన్నప్పటికీ ఎదుటి పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలనే వ్యూహంతో ఉండటంతో బీఆర్ఎస్ నుంచి ఎవరూ రంగంలో ఉంటారనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకడం కష్టమే. -
మల్కాజ్గిరి.. మామకు సవాల్ !
సాక్షి,సిటీబ్యూరో : ఎన్నో విశేషాలున్న మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ విజయం ప్రధాన పార్టీలన్నింటికీ అతిముఖ్యం కావటంతో ఎవరికి వారే వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో వెళుతున్నారు. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున మంత్రి మల్లారెడ్డి అల్లుడు, యువ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయ కుడు ఎ.రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామ చంద్‌రావులు బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం టీఆర్ఎస్లో తీవ్ర పోటీ ఉన్నా.. రాజకీయ సమీకరణాల్లో మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఎంపిక చేసిన అధిష్టానం.. గెలుపు బాధ్యతను మాత్రం మంత్రి మల్లారెడ్డిపైనే మోపింది. మల్లారెడ్డి ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేసిన రెండు ఎన్నికల్లో అల్లుడు రాజశేఖర్‌రెడ్డి గెలుపు బాధ్యతను భుజాన వేసుకుంటే.. ఈ ఎన్నికలో మాత్రం అల్లుడి కోసం మామ అన్నీ తానై వ్యవహరించాల్సి వస్తోంది. నియోజకవర్గంపై పూర్తి పట్టున్న మల్లారెడ్డి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశాలు పూర్తి చేశారు. మంగళవారం నుంచి నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. రాజశేఖర్‌రెడ్డి విజయం మంత్రి మల్లారెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం కావటంతో మామ సవాలుగా తీసుకుని ముందుకు వెళుతున్నారు. ఐదేళ్లలో ఎంతో తేడా.. 2014 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో ఇక్కడ విజయం సాధించిన టీడీపీ.. తాజా ఎన్నికలకు వచ్చేసరికి పోటీలోనే లేకుండా పోయింది. ఇక బీజేపీ, జనసేనలు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. ఈసారి ఎవరికి వారే పోటీకి దిగారు. గడిచిన ఎన్నికల్లో మాజీ ఐఏఎస్ అధికారి లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ, మా జీ డీజీపీ దినేష్‌రెడ్డిలు ఇక్కడి నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొదటిసారే లోక్‌సభకు.. ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చామకూర మల్లారెడ్డి తన తొలి ప్రయత్నంలోనే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఆపై టీఆర్ఎస్లో చేరిన మల్లారెడ్డి.. పదవికి రాజీనామా చేసి శాసనసభకు అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. తొలిసారే లోక్‌సభపై గురి రాజశేఖర్‌రెడ్డి రాజకీయాలకు కొత్త. మామ మల్లారెడ్డి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలో తెర వెనక నుంచి అల్లుడు మంత్రాంగమంతా నడిపారు. మేడ్చల్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో రాజశేఖర్‌రెడ్డికి విస్తృత సంబంధాలున్నాయి. తన గెలుపు బాధ్యతను మల్లారెడ్డితో పాటు బంధువులపై ఉంచి తాను ప్రజలతో మమేకం కానున్నారు. -
మల్లారెడ్డిపై చర్యలు తీసుకోండి: వైఎస్సార్సీపీ
* కాలేజీల వివరాలు ఇవ్వలేదు * ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న సీహెచ్ మల్లారెడ్డి తనకున్న మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల సమాచారాన్ని దాచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యా దు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన తన కాలేజీల వివరాలు ఇవ్వకుండా నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. మంగళవారం ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ను కలిసిన పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్, ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షుడు బి.జనక్ ప్రసాద్, లీగల్ సెల్ కన్వీనర్ సి.నాగేశ్వర్రావు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను అందజేశారు. ఫిర్యాదులో వివరాలు..: వివిధ విద్యా సంస్థల అధినేతగా అందరికి తెలిసిన మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఆ వివరాలను వెల్లడించలేదని పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 నిబంధనల ఉల్లంఘనేనని, సమాచారాన్ని వెల్లడించకుండా దాచే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆయన 19 విద్యా సంస్థలకు వ్యవస్థాపక చైర్మన్‌గా, ఇతర హోదాల్లో ఉన్నారని పేర్కొన్నారు. అందులో 9 ఇంజనీరింగ్ కాలేజీలు, 3 ఫార్మసీ కాలేజీలు, 5 మేనేజ్మెంట్, బిజినెస్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజీ, పీజీ కాలేజీల్లో ఆయనకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలిపారు. ఆయనకున్న ఈ కాలేజీల పేర్లతోపాటు వివరాలను ఫిర్యాదులో పొందుపరిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనపై తగిన చర్యలు చేపట్టాలని కోరారు. -
కాంగ్రెస్ పాలనలో దేశం నాశనం: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం సర్వనాశనమైందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. సోమవారం మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి మల్లారెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావులకు మద్దతుగా చంద్రబాబు మల్కాజ్‌గిరిలో రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో నిత్యావసర సరుకులు, విద్యుత్, పెట్రోలు చార్జీలు విపరీ తంగా పెరగాయన్నారు. సోనియా గాంధీ ఊరికి ఒక అనకొండను తయారు చే సిందని విమర్శించారు. సోనియా చేతిలో ప్రధానమంత్రి రోబోలా తయారయ్యాడన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. సామాజిక తెలంగాణ టీడీపీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలుగుజాతికి పునర్వైభవం తీసుకురావడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. బాబు సభకు టీడీపీ, బీజేపీ నేతల డుమ్మా ఎల్బీనగర్లో సోమవారం చంద్రబాబు నిర్వహించిన బహిరంగసభకు సొంత పార్టీ నేతలే డుమ్మా కొట్టారు. టికెట్ దక్కలేదని మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్న నియోజకవర్గ ఇన్చార్జి ఎస్వీ కృష్ణప్రసాద్ సభకు రాలేదు. కర్మన్‌ఘాట్, పీఅండ్‌టీ కాలనీ, హయత్‌నగర్, వనస్థలిపురం కార్పొరేటర్లు సభకు డుమ్మా కొట్టారు. సభలో మోడీ, కిషన్‌రెడ్డి ఫోటోలతో పాటు బీజేపీ జెండాలు, బ్యానర్లు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆగ్రహించారు. టీడీపీకి వ్యతిరేకంగా నినదిస్తూ సభ నుంచి నిష్ర్కమించారు. -
పోటీ నుంచి తప్పుకున్న చందనా చక్రవర్తి
హైదరాబాద్: మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి, సామాజిక కార్యకర్త చందనాచక్రవర్తి వ్యక్తిగత కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. పార్టీ నేతలతో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని, స్వచ్ఛందంగానే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ స్థానంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మనవడు డాక్టర్ సుధాకిరణ్‌ను బరిలోకి దించాలని ఆప్ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. -
బహుముఖ పోరు.. ఎవరిదో టాప్ గేరు?
ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా ఇప్పుడు ఆ సీటు మాటే. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అత్యధిక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దేశంలోనే పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా అవతరించిన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. ఇక్కడ విద్యావంతులకు తోడు దేశంలోని వివిధ రాష్ట్రాలు, రాష్ట్రంలోని సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన జనం పెద్దసంఖ్యలో ఉండడంతో ఆశావహులు ఈ సీటుపై కన్నేశారు. కొత్తగా పుట్టుకొచ్చిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా ఇక్కడి నుంచి తమ అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను ఇక్కడి నుంచి పోటీకి పెట్టాలని యోచిస్తోంది. ఉండవల్లిని బరిలోకి దింపడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని జై సమైక్యాంధ్ర పార్టీ భావిస్తోంది. తద్వారా తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, లోక్‌సత్తా తరపున జయప్రకాష్ నారాయణ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థిగా చందన చక్రవర్తి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. మిగతా పార్టీల తరపున రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ బహుముఖ పోరు తప్పదని అర్థమవుతోంది. మల్కాజ్గిరి సమరం రసవత్తరంగా సాగుతుందనడంతో ఎటువంటి సందేహం లేదు. అంతిమంగా మల్కాజ్గిరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.