హైదరాబాద్: గ్రేటర్‌పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పారీ్టల అభ్యర్థుల్లో కొందరు తమ ఓటును తమకు వేసుకోలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్ ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీ¯న్ ఒవైసీ రాజేంద్రనగర్ పరిధిలోని శా్రస్తిపురంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్‌లో ఉంది.
ఈ ప్రాంతం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ నివాసం జూబ్లీహిల్స్‌లో ఉంది. అది సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. చేవెళ్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. అది మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డికి తాండూరులో ఓటుంది. ఆ ప్రాంతం చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. వీరందరూ తమ ఓటును తాము వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment