హైదరాబాద్ (సంతోష్ నగర్) : స్కూటీని లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్లోని డీఆర్‌డీఎల్ సంస్థ కార్యాలయుం సమీపంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు చోటుచేసుకుంది. స్కూటీ పై వెళుతున్న వారిని వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్కూటీని ఢీకొట్టిన లారీ : ఇద్దరు మృతి
Published Fri, Jun 19 2015 4:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement