
నరసరావుపేట టౌన్: స్కూటీలో దాచిన నగదు అపహరించుకు వెళ్లిన సంఘటన గురువారం పట్టణంలో కలకలం రేపింది. నిత్యం జన సంచా రంతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అం దరూ చూస్తుండగానే దుండగులు అత్యంత చాకచక్యంగా వాహన సీటును తొలగించి రూ.2.25 లక్షలను అపహరించారు. గమనించిన యజమాని స్థానికుల సహాయంతో చోరులను వెంబడించినా ఫలితం దక్కకుండా పోయింది. వివరాల్లో కెళితే.. పట్టణంలోని బరంపేటకు చెందిన గంధం సూర్యనారాయణ గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో ఇండియన్ బ్యాంక్‌లో రూ.3.5 లక్ష ల నగదును విత్‌డ్రా చేశాడు. ఆ నగదును తన స్కూటీ వాహనంలో భద్రపరిచి మెయిన్ రోడ్డు ఏరియా ప్రభుత్వ వైద్యశాల సమీపంలో గల తన స్నేహితుడి వస్త్ర దుకాణం గౌరీ శంకర్ టెక్స్‌టైల్స్ వద్దకు వచ్చాడు. దుకాణం ఎదుట వాహనాన్ని నిలిపి యజమానితో మాట్లాడుతున్నాడు.
ఆ సమయంలో ఇద్దరు దుండగులు స్కూటీ వద్ద నిల్చొని వేచిఉన్నట్లుగా నటిస్తూ సీటును బలవంతంగా పైకిఎత్తి అందులో ఉన్న రూ.2.25 నగదును అపహరించారు. గమనించిన వస్త్ర దుకాణ యజమాని కొండారెడ్డి కేకలు వేయడంతో అప్రమత్తమైన దుం డగులు ఇద్దరూ ద్విచక్రవాహనంపై పరారయ్యా రు. బాధితుడు సూర్యనారాయణ స్థానికుల సహా యంతో చోరులను వెంబడించినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను సేకరించి, నిందితులను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిలాలుద్దీన్ తెలిపారు.