
కర్ణాటక,బనశంకరి: కరోనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మహిళ స్కూటీని పోలీసులు సీజ్ చేసేందుకు యత్నించడంతో ఆమె ఖాకీల కాళ్లు పట్టుకుని వేడుకున్న సంఘటన బెంగళూరు శిర్కి సర్కిల్ వద్ద చోటుచేసుకుంది. గురువారం ఉదయం లాక్‌డౌన్ సడలింపు సమయం ముగిశాక స్కూటీపై వెళుతున్న మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు బయటకు వచ్చావంటూ ఆమెను మందలించారు. స్కూటీ తాళాలు తీసుకోవడంతో ఆమె విలపిస్తూ వదిలిపెట్టండి అంటూ పోలీసులు కాళ్ల మీద ప్రాధేయపడింది. చివరికి పోలీసులు స్కూటీతో సహా వదిలేశారు. (ఉల్లంఘనులకు శుభవార్త)
Comments
Please login to add a commentAdd a comment