పేలిన స్కూటీ టైర్‌ | Scooty Tire Burst Man Died in Rangareddy | Sakshi
Sakshi News home page

పేలిన స్కూటీ టైర్‌

Published Wed, Apr 3 2019 10:56 AM | Last Updated on Wed, Apr 3 2019 10:56 AM

Scooty Tire Burst Man Died in Rangareddy - Sakshi

చంద్రశేఖర్‌ మృతదేహం

మహేశ్వరం: స్కూటీ టైర్‌ పేలిపోవడంతో వాహనం అదుపుతప్పడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని సిరిగిరిపురం గేటు సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ వెంకన్న నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వనస్థలిపురానికి చెందిన పోల చంద్రశేఖర్‌(45 ) రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం కందుకూరు మండలంలోని ఉద్యోగుల వేతనాలు, ఇతర పత్రాలను ఇచ్చేందుకు తన స్కూటీ (టీఎస్‌ 08 ఈహెచ్‌ 5491)పై మహేశ్వరం ఎస్టీఓ కార్యాలయం వైపు వస్తున్నాడు. ఈక్రమంలో సిరిగిరిపురం గేటు వద్ద స్కూటీ టైర్‌ పగిలిపోవడంతో వాహనం కిందపడింది.

ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌ కిందపడిపోవడంతో తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్త్రావం జరిగి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెంటనే వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడి జేబులో లభించిన ఐడెంటిటీ కార్డుతో సాయంతో అతడి వివరాలు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్కూటీ టైర్‌ పగిలిపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు, స్థానికులు తెలిపారు. మృతుడి తోటి ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement