tire burst
-
అన్నా ఏందిది..! అదేమన్నా ట్రక్కనుకున్నావా..? తోసుకెళ్తున్నారు..
ఎక్కడాగిపోతాయో తెలియని ఎర్ర బస్సులను ఎక్కాలంటే గుండెలు దడదడలాడాల్సిందే! చెప్పాపెట్టకుండా ఏ రోడ్డుమధ్యలోనే టైర్ పంక్చరయ్యో లేక ఇంజన్ ఫెయిలయ్యో ఆగిపోతే ఈసురోమంటూ.. ఎక్కిన ప్రయాణికులందరూ కిందికి దిగి బస్సును తొయ్యడం.. దాదాపు అందరి జీవితాల్లో ఈ సీన్ ఎదురయ్యే ఉంటుంది. ఐతే ఇక్కడ టైర్ పంక్చర్ అయ్యింది బస్సుకు కాదు, కారుకు అంతకన్నాకాదు. విమానానికి... ఆ..! అవును అక్షరాలా విమానానికే.. పాపం అందరూ తలోచెయ్యివేసి తోసుకుంటూ తీసుకెళ్లారు. నెపాల్‌కు చెందిన తారా ఎయిర్‌లైన్స్ చోటుచేసుకున్న ఈ సంఘటన ఇది. రన్‌వేపై ఆగివున్న విమానాన్ని ప్యాసెంజర్లు, సెక్యురిటీ సిబ్బంది నెట్టుకుంటూ తీసుకెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తుంది. నేపాల్ జర్నలిస్ట్ సుషీల్ భట్టారాయ్ కథనం ప్రకారం.. టైర్ పేలడంతో రన్‌వేపై ఈ విమానం ఆగింది. ఇతర విమానాల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్యాసెంజర్లు, సెక్యురిటీ సిబ్బంది సహాయంతో దానిని పక్కకు నెట్టవలసి వచ్చిందని పేర్కొన్నారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘అన్నా ఇది ట్రక్కు అనుకుంటున్నావా? 10 మందితో తోసుకుంటూ వెళ్లడానికి' అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు పేల్చుతున్నారు. నిజానికి ఇది నేపాల్ వైమానిక అధికారుల తప్పిదం. ఎయిర్‌పోర్టులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే సరిచేసే పరికరాలు వారి వద్ద ఉండాలి. లేకపోవడంతో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. చదవండి: Lucknow: ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్! सायद हाम्राे नेपालमा मात्र होला ! pic.twitter.com/fu5AXTCSsw — Samrat (@PLA_samrat) December 1, 2021 -
ఔటర్ రింగ్ రోడ్డుపై టైర్ పేలి.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై మహేంద్ర మ్యాక్సీ ట్రక్ వాహనం టైర్ పేలి ఇద్దరు మృతిచెందారు. బుధవారం ఉదయం కూలీలను మ్యాక్సీ ట్రక్‌లో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓఆర్ఆర్పై మ్యాక్సీ ట్రక్ వాహనం రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. దీంతో ఆ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న కూలీలు రోడ్డుపై ఎగిరిపడ్డారు. ఒక మహిళ ఘటన స్థలంలోనే మృతిచెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు టైర్ పేలి కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: ఓ యువతి కిడ్నాప్ కేసులో బిహార్ రాష్ట్రానికి వెళ్లి నిందితుడిని తీసుకొస్తుండగా మార్గమధ్యంలో టైర్ పేలిన ఘటనలో నిందితుడు రోషన్‌తోపాటు కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుషాల్ ప్లాస్టిక్ పరిశ్రమలో అంకిత, బిహార్ రాష్ట్రానికి చెందిన రోషన్ పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు తెలియడంతో అంకితను పని మాన్పించారు. దీంతో రోషన్ అంకితను తీసుకొని బిహార్‌కు వెళ్లిపోయాడు. దీనిపై కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. రోషన్ స్వగ్రామానికి ఏపీ 28 బీపీ 2228 ఇన్నోవా వాహనంలో బయలుదేరిన పోలీసులు రోషన్, అంకితను హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా దిండోరి జిల్లా జబల్పూర్ ప్రాంతంలో కారు టైర్ పేలి 3 పల్టీలు కోట్టింది. ఈ ఘటనలో నిందితుడు రోషన్, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న తులసీరామ్ మృతిచెందగా.. ప్రైవేటు డ్రైవర్‌తోపాటు ఎస్ఐ రవీంద్రనాయక్, మహిళా కానిస్టేబుల్ లలిత, అంకితలు తీవ్రగాయాలకు గురయ్యారు. దీంతోవారిని ఆస్పత్రికి తరలించారు. 2018 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ తులసీరామ్‌కు మే 8వ తేదీన వివాహం జరిగింది. విధి నిర్వహణలో ఎంతో చురుకుగా ఉండే తులసీరామ్ పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే మృతి చెందడం పట్ల పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బస్సు టైరు ఢాం..!
కాణిపాకం: తిరుపతి నుంచి 60 మంది ప్రయాణికులతో కాణిపాకం వస్తున్న ఆర్టీసి బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. ఏపీ 10 జడ్ 0119 నంబరు గల బస్సు తిరుపతి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 60 మందితో కాణిపాకానికి వస్తూ ప్రమాదానికి గురైంది. ఈ బస్సు కాణిపాకానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా వెనుక చక్రం ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ప్రయాణికులు హడలిపోయారు. సమీపంలో రోడ్డు పక్కగా విద్యుత్ స్తంభం ఉంది. విద్యుత్ వైర్లు తగిలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని ప్రయాణికులు చెప్పారు. ఎండ వేడి మూలాన టైరు పేలి ఉంటుందని ఆర్టీసి సిబ్బంది పేర్కొన్నారు. మండుటెండలో టైరు పేలి బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొంతసేపటికి వెనుక వచ్చిన మరో బస్సులో ప్రయాణికులను కాణిపాకానికి చేర్చారు. కాలం చెల్లిన బస్సులే ఎక్స్‌ప్రెస్ సర్వీసులు! తిరుపతి–కాణిపాకం మధ్య ఎక్కువ శాతం ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులను ఎక్స్‌ప్రెస్ పేరుతో నడుపుతోందని భక్తులు మండిపడుతున్నారు. రోజుకు 10 సర్వీసులతో వంద ట్రిప్పుల వరకు నిత్యం ఐదు వేల మందిని గమ్యానికి చేరుస్తున్నాయి. అయితే 70 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా పల్లె వెలుగు బస్సులను నడుపుతున్నారని, వీటిని నుంచి వచ్చే శబ్దాలతో రెండు గంటల పాటు తీవ్ర ఇబ్బందుల నడుమ ప్రయాణం చేస్తున్నట్టు ప్రయాణికులు ఆగ్రహించారు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు మంచి కండిషన్లో ఉన్న బస్సులనే ఈ మార్గంలో నడపాలని కోరారు. -
పేలిన స్కూటీ టైర్
మహేశ్వరం: స్కూటీ టైర్ పేలిపోవడంతో వాహనం అదుపుతప్పడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ సీనియర్ అసిస్టెంట్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని సిరిగిరిపురం గేటు సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ వెంకన్న నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వనస్థలిపురానికి చెందిన పోల చంద్రశేఖర్(45 ) రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం కందుకూరు మండలంలోని ఉద్యోగుల వేతనాలు, ఇతర పత్రాలను ఇచ్చేందుకు తన స్కూటీ (టీఎస్ 08 ఈహెచ్ 5491)పై మహేశ్వరం ఎస్టీఓ కార్యాలయం వైపు వస్తున్నాడు. ఈక్రమంలో సిరిగిరిపురం గేటు వద్ద స్కూటీ టైర్ పగిలిపోవడంతో వాహనం కిందపడింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ కిందపడిపోవడంతో తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్త్రావం జరిగి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెంటనే వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడి జేబులో లభించిన ఐడెంటిటీ కార్డుతో సాయంతో అతడి వివరాలు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్కూటీ టైర్ పగిలిపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు, స్థానికులు తెలిపారు. మృతుడి తోటి ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రగతి చక్రం..బస్సు వీడి పరుగులు!
కణేకల్లు: రాయదుర్గం ఆర్టీసీ డిపో బస్సుకు శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళితే ఏపీ02జెడ్ 1066 ఆర్టీసీ బస్సు ఉరవకొండకు వెళ్లేందుకు ఉదయం 7గంటలకు రాయదుర్గంలో బయలుదేరింది. 7.35 గంటలకు కణేకల్లులోని రామనగర్‌కు రాగానే ఒక్కసారిగా బస్సుకు కుడివైపున వెనుకున్న రెండు చక్రాలు బోల్టులు లూజై ఊడొచ్చాయి. బస్సు రన్నింగ్‌లో ఉండగా ఉన్నట్టుండి బ్యాలెన్స్ తప్పి కుడివైపులాగుతుండటంతో డ్రైవర్ వన్నూర్సాబ్కు అనుమానం వచ్చింది. దీంతో వేగాన్ని కంట్రోల్ చేశాడు. అయినప్పటికీ రెండు చక్రాలూ ఊడి బయటికొచ్చాయి. బస్సు ఒక్కసారిగా కుడివైపు ఒరిగి నాలుగు అడుగుల దూరం వరకు వెళ్లింది. ఆ సమయంలో 15 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తమై బస్సు వేగాన్ని నియంత్రించడంతో ప్రమాదం త్రుటిలో తప్పిందని ప్రయాణికులు తెలిపారు. మరో 40 అడుగుల దూరంలో బస్టాప్ ఉండటంతో బస్సు తక్కువ స్పీడ్‌తో వస్తోంది. దేవుని దయవల్ల ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులు ఊపీరి పీల్చుకొన్నారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం రాయదుర్గం – ఉరవకొండ మార్గంలో కండీషన్ లేని డొక్కు బస్సులు తిప్పుతున్నారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిపో నుంచి బయటికొస్తున్న బస్సుల కండీషన్‌ను సైతం అధికారులు పరీక్షించడం లేదని వాపోతున్నారు. కణేకల్లులో శుక్రవారం ఆర్టీసీ బస్సుకు రెండు చక్రాలు ఊడిరావడంతో ప్రయాణికుల భద్రతపై ఆర్టీసీకి ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు. ఆటోలో ప్రయాణం ప్రమాదకరం– ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని చెప్పడం కాదని.. డొక్కు బస్సులను ఆపేసి కండీషన్ ఉన్న బస్సులను నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
బ్రిడ్జిపై వేలాడుతూ టిప్పర్ లారీ!
భువనగిరి అర్బన్: టైరు పేలడంతో డివైడర్‌ను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఓ టిప్పర్ లారీ బ్రిడ్జి దిమ్మెలపై నిలిచిపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ఫ్లై ఓవర్‌పై మంగళవారం చోటుచేసుకుంది. బొమ్మలరామారం నుంచి ఆత్మకూర్‌కు కంకర లోడ్‌తో టిప్పర్ లారీ వెళ్తుంది. రాయగిరి గ్రామంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదకు రాగానే ముందు టైరు పేలడంతో డివైడర్‌ను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బ్రిడ్జి చివరి భాగంలో వేలాడుతూ నిలిచిపోయింది. టైర్లు విడిపోయి బ్రిడ్జి కిందకు వేలాడుతున్నాయి. లారీ డ్రైవర్ గణేశ్, క్లీనర్ బాలరాజ్‌కు స్వల్ప గాయాలవ్వడంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వంతెన పైనుంచి లారీ బోల్తాపడి ఇద్దరు మృతి
ఆదిలాబాద్(నేరడిగొండ): మండలంలోని కుప్టి వంతెనపై నుంచి లారీ బోల్తాపడి డ్రైవర్, క్లీనర్ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు కిరా ణా, జనరల్ సామగ్రితో వస్తున్న లారీ కుప్టి వంతెన వద్దకు రాగానే ముందు టైరు పగిలింది. దీంతో అదుపు తప్పిన లారీ వంతెనపైనుంచి లోయలో పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కిశోర్‌సింగ్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు.క్లీనర్ రజాక్‌కు తీవ్రగాయాలు కావడం తో 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగాఅక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్‌ది ఆదిలాబాద్‌లోని భూక్తాపూర్ కాలనీ కాగా క్లీనర్ మామడ మండలం తాండ్రవాసీగా గుర్తించినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైలు ఢీకొని యువకుడు.. తాండూర్ : మండలంలోని తాండూర్ బస్టాండ్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రైలు ఢీకొన్న ఘటనలో తాండూర్ గ్రా మం బోయవాడకు చెందిన బోనె లక్ష్మణ్ (27) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లారీ క్లీనర్‌గా పని చేసే లక్ష్మణ్ గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి శుక్రవారం తెల్లవారుజామున రైలు పట్టాలపై శవమై కనిపించా డు. లక్ష్మణ్ ప్రమాదవశాత్తు మృతి చెం దాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న విషయం తెలియరాలేదు. మృతుడికి భా ర్య వైశాలి, కుమారుడు విష్ణు ఉన్నారు. మంచిర్యాలలో గుర్తు తెలియని వ్యక్తి.. మంచిర్యాల టౌన్ : మంచిర్యాల గర్మిళ్ల శివారులోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం గుర్తు తెలియని 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జగన్ కథనం ప్రకారం.. ఉదయం 6-30గంటల ప్రాంతంలో రామగుండం నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న జీటీ రైలు గుర్తు తెలి యని వృద్ధుడిని ఢీ కొట్టడంతో మృతి చెందాడు. మృతుడు తెలుపు రంగు ఫుల్ షర్ట్, తెలుపు, పచ్చ రంగుల అంచులున్న పంచె ధరించి ఉన్నా డు. మరే ఇతర ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి శవాల గదిలో భద్రపరిచినట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.