Nepal Pushing Aircraft On The Runway Is Going Viral On Social Media - Sakshi
Sakshi News home page

Nepal:అన్నా ఏందిది..! అదేమన్నా ట్రక్కనుకున్నావా..? తోసుకెళ్తున్నారు..

Published Fri, Dec 3 2021 3:19 PM | Last Updated on Fri, Dec 3 2021 5:06 PM

Nepal Pushing Aircraft On The Runway Is Going Viral On Social Media - Sakshi

ఎక్కడాగిపోతాయో తెలియని ఎర్ర బస్సులను ఎక్కాలంటే గుండెలు దడదడలాడాల్సిందే! చెప్పాపెట్టకుండా ఏ రోడ్డుమధ్యలోనే టైర్‌ పంక్చరయ్యో లేక ఇంజన్‌ ఫెయిలయ్యో ఆగిపోతే ఈసురోమంటూ.. ఎక్కిన ప్రయాణికులందరూ కిందికి దిగి బస్సును తొయ్యడం.. దాదాపు అందరి జీవితాల్లో ఈ సీన్‌ ఎదురయ్యే ఉంటుంది. ఐతే ఇక్కడ టైర్‌ పంక్చర్‌ అ‍య్యింది బస్సుకు కాదు, ​కారుకు అంతకన్నాకాదు. విమానానికి... ఆ..! అవును అక్షరాలా విమానానికే.. పాపం అందరూ తలోచెయ్యివేసి తోసుకుంటూ తీసుకెళ్లారు.

నెపాల్‌కు చెందిన తారా ఎయిర్‌లైన్స్‌ చోటుచేసుకున్న ఈ సంఘటన ఇది. రన్‌వేపై ఆగివున్న విమానాన్ని ప్యాసెంజర్లు, సెక్యురిటీ సిబ్బంది నెట్టుకుంటూ తీసుకెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తుంది. నేపాల్‌ జర్నలిస్ట్‌ సుషీల్‌ భట్టారాయ్‌ కథనం ప్రకారం.. టైర్‌ పేలడంతో రన్‌వేపై ఈ విమానం ఆగింది. ఇతర విమానాల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్యాసెంజర్లు, సెక్యురిటీ సిబ్బంది సహాయంతో దానిని పక్కకు నెట్టవలసి వచ్చిందని పేర్కొన్నారు. 

కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ‘అన్నా ఇది ట్రక్కు అనుకుంటున్నావా? 10 మందితో తోసుకుంటూ వెళ్లడానికి' అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు పేల్చుతున్నారు. నిజానికి ఇది నేపాల్‌ వైమానిక అధికారుల తప్పిదం. ఎయిర్‌పోర్టులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే సరిచేసే పరికరాలు వారి వద్ద ఉండాలి. లేకపోవడంతో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

చదవండి: Lucknow: ఫేస్‌బుక్‌లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement