
సాక్షి, రాజన్న సిరిసిల్ల: చిన్నదే కానీ చుక్కలు చూపించింది. స్కూటీలో దూరి ఓనర్‌ని టెన్షన్ పెట్టించింది. దానిని చూసేందుకు జనం సైతం ఎగబడడంతో భారీగా ట్రాఫిక్‌ఝామ్ కూడా అయ్యింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద జరిగిన హైడ్రామా.. స్నేకా.. మజాకా అని అందరితో అనిపించింది.
సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ వద్ద షబ్బీర్ అనే వ్యక్తి ఓ షాప్ ముందుకు తన స్కూటీని ఉంచాడు. అయితే.. నెమ్మదిగా అందులోకి దూరింది ఓ పాము. సమాచారం అందన్కున్న స్నేక్ క్యాచర్ గంటపాటు శ్రమించి బండి మొత్తం పార్ట్స్ విప్పదీశాడు. ఎట్టకేలకు ఆ చిన్నపామును పట్టుకోగలిగాడు. ఆపై దానిని వాటర్ బాటిల్‌లో దూర్చి దూరంగా తీసుకెళ్లాడు.
స్కూటీలో పాము దూరిందనే వార్త సాధారణంగానే జనాలను ఆకట్టుకుంది. చుట్టూ మూగి ఆ డ్రామా అంతా చూస్తూ ఉండిపోయారు. చివరకు పామును స్నేక్‌క్యాచర్ పట్టేయడంతో స్కూటీ ఓనర్ ఊపిరి పీల్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment