
స్కూటీలో పాము, పట్టుకున్న నరేశ్
సాక్షి, బెంగళూరు : పాము కప్పను మింగి భయంతో స్కూటీలోకి దూరిపోయి ఐదు గంటల పాటు స్కూటీ యజమానిని భయపెట్టింది. ఈ ఘటన చిక్కమగళూరు కల్యాణనగరలోని పుష్పగిరిలేఔట్‌లో జరిగింది. ఎస్‌ఐ కుమారస్వామి భార్యకు స్కూటీ ఉంది. స్కూటీని ఇంటి వద్ద నిలిపి ఉండగా, ఎక్కడి నుంచో వచ్చిన ఓ నాగుపాము కప్పను స్వాహా చేసింది. పామును చూసిన వారు పెద్దగా కేకలు వేశారు. దీనితో పాము భయపడి పక్కలోని స్కూటీ హెడ్‌లైట్ లోపలికి చేరింది. మొదట మెకానిక్‌ను రప్పించి డూంను తీయించటానికీ ప్రయత్నించారు. అయితే మెకానిక్ భయంతో వెనుదిరిగి వెళ్లాడు. పాములు పట్టే స్నేక్ నరేశ్ సమాచారం అందించారు. ఆయన రాగానే స్కూటీని దూరంగా తీసుకెళ్లి దానిని ఆన్ చేయించారు. డూం లోపలికి పైప్‌తో వేగంగా నీటిని చిమ్మడంతో పాము బయటకు వచ్చింది. నరేశ్ దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలారు.
Comments
Please login to add a commentAdd a comment