
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఒకినావా స్కూటర్స్.. ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించించి. రూ.8,600 వరకు ధరలను తగ్గించిన ఈ సంస్థ.. లెడ్ యాసిడ్ శ్రేణి వాహన ధరలను రూ.2,500–రూ.4,700 వరకు తగ్గించింది. లిథియం అయాన్ శ్రేణి స్కూటర్ ధరలను రూ.3,400–రూ.8,600 వరకు తగ్గించినట్లు ప్రకటించింది. రూ.37,000–రూ.1.08 లక్షల ధరల శ్రేణిలో ఈ సంస్థ వాహనాలను విక్రయిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై వస్తు సేవల పన్ను రేటును 12 నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం కోసం ఈ మేరకు ధరలను తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment